Ads
వరకు టాలీవుడ్ లో 100 కోట్లు కలెక్షన్స్ దాటాలంటే పెద్ద గగనమే అని చెప్పాలి. బాహుబలి సినిమాతో ప్రభాస్ మొదటిసారిగా 100 కోట్లు షేర్ లోకి అడుగు పెట్టారు. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా 300 కోట్ల షేర్ రాబట్టింది.
Video Advertisement
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా 216 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి 100 కోట్ల షేర్ లోకి అడుగు పెట్టిన తర్వాత మూవీ గా నిలిచింది. నెక్స్ట్ ఈ లిస్టులోకి మహేష్ బాబు వచ్చి చేరారు.భరత్ అనే నేను మూవీతో 225 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి 100 కోట్లు షేర్ క్లబ్ లోకి చేరారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి 130 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఆర్ఆర్అర్ తో మొదటి సారి 100 కోట్ల షేర్ లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టగా, రాంచరణ్ కి రెండో వంద కోట్ల షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో 225 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి 100 కోట్లు షేర్ క్లబ్ లోకి అడుగు పెట్టారు.
ఇక తాజాగా ఈ లిస్టులోకి యంగ్ హీరో తేజ సజ్జా వచ్చి చేరారు. ఆయన నటించిన హనుమాన్ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 207 కోట్లు కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ చిత్రం కూడా 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఇక్కడ విశేషమేంటంటే ఈ చిత్రం ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. భవిష్యత్తులో ఈ క్లబ్ లోకి అడుగుపెట్టే ఇతర హీరోలు ఎవరో వేచి చూడాలి.
End of Article