టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచారు. భార్య దూరం అవడం తో ఉత్తేజ్ పరిస్థితి మరింత బాధాకరం గా ఉంది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన నటులు.. ఆయన విలపిస్తుంటే చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

uttej 1

నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి (48) గత కొంత కాలం గా కాన్సర్ తో బాధపడుతున్నారు. హైద్రాబాదు లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలోనే ఆమె చికిత్స తీసుకున్నారు. తాజాగా, ఆమె పరిస్థితి విషమించడం తో ఈరోజు ఉదయమే ఆమె కన్నుమూశారు. మహాప్రస్థానం లో ఆమె అంత్య క్రియలు జరగనున్నాయి. ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొనడం తో టాలీవుడ్ దుఃఖం లో మునిగింది.

uttej 3

ఉత్తేజ్ భార్య పద్మావతి మరణించారని తెలియడం తో.. మెగాస్టార్ చిరంజీవి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఉత్తేజ్ ను ధైర్యం గా ఉండాలంటూ పరామర్శించారు. ఆయన రాగానే.. ఉత్తేజ్ మెగాస్టార్ ను పట్టుకుని భోరున విలపించారు. ప్రకాష్ రాజ్, జీవిత, బ్రహ్మాజీ లు కూడా ఉత్తేజ్ ను పరామర్శించడానికి అక్కడకు చేరుకున్నారు. పలువురు సెలెబ్రిటీలు నటుడు ఉత్తేజ్ కు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నారు. ఆయన భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.  భార్య వియోగం తో ఉత్తేజ్ కు తీరని లోటు కలిగింది. ఆయన భార్య కు శాంతి చేకూరాలని కోరుకుందాం.

uttej

Watch Video: