“దేవత” పాత్రలో నటించి మెప్పించిన 10 మంది హీరోయిన్లు…అందరిలో హైలైట్ ఎవరంటే.?

“దేవత” పాత్రలో నటించి మెప్పించిన 10 మంది హీరోయిన్లు…అందరిలో హైలైట్ ఎవరంటే.?

by Anudeep

Ads

దేవతల మీద సినిమాలలో ప్రధానంగా అందరి ఫోకస్ ఆ దేవత క్యారెక్టర్ చేసే యాక్టర్ మీద ఉంటుంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అప్పటి వరకు గ్లామరస్ రూల్ లో కనిపించి తిరిగి ఒక దేవతా మూర్తి క్యారెక్టర్ లో జనాల్ని మెప్పించడం అంతా సామాన్యమైన పని కాదు. అయినప్పటికీ సౌత్ ఇండియాలోని కొందరు యాక్టర్స్ అటు గ్లామరస్ రోల్ తో పాటు ఇటు దేవతలుగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.. మరి వారు ఎవరో చూద్దామా.

Video Advertisement

#1. రమ్యకృష్ణ
అటు హీరోయిన్గా, విలన్ గా ఎన్నో వినూత్నమైన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ అమ్మోరు చిత్రం ద్వారా తను దేవతా మూర్తిగా నటించగలను అని ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమాలో రమ్యకృష్ణను చూసిన ఎందరో నిజంగా అమ్మోరు అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె అమ్మవారిగా దేవుళ్ళు, జగన్మాత లాంటి పలు చిత్రాల్లో నటించారు.

#2. రోజా
సుదీర్ఘ విరామం తర్వాత రోజా మళ్లీ సినిమాల్లోకి వచ్చిన చిత్రం చౌడేశ్వరి దేవి మహిమే. చౌడేశ్వరి దేవి అవతారం లో తన పాత్రకు న్యాయం చేసింది. రోజా తెలుగు బయోగ్రాఫికల్ మూవీ జగద్గురు ఆదిశంకరలో లక్ష్మీ దేవిగా కనిపిస్తుంది.

 

#3. సౌందర్య
‘ఆధునిక సినిమా సావిత్రి’ అని తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సౌందర్య. ఆమె 2000లో నాగదేవతే చిత్రంలో నాగమ్మగా నటించింది. ఈ చిత్రంలో సగభాగం పాముగా తల మాత్రమే మనిషిగా చూపించే సన్నివేశంలో సౌందర్య తన కంటి అభినయంతోనే అద్భుతంగా నటించారు.

#4. విజయశాంతి
విజయశాంతి మహా చండీ అనే తెలుగు సినిమాలో చండీ దేవి పాత్రను పోషిస్తుంది. 2002లో, ఆమె దేవత శ్రీ బన్నారి అమ్మన్ యొక్క టైటిల్ పాత్రను పోషించింది. అంతకు ముందు వరకు ఎన్నో చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్ పాత్రతో పాటు కరాటే క్వీన్ పాత్రను కూడా పోషించి మెప్పించిన విజయశాంతి దేవతాపాత్ర తో అందరి మనసులు దోచుకున్నారు.

#5. నయనతార
నయనతార శ్రీ రామరాజ్యం (2011) చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన రాముడిగా సీతాదేవిగా కనిపించింది. దీని కోసం ఆమె ఉత్తమ నటిగా నంది అవార్డు మరియు ఉత్తమ తెలుగు నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

#6. భానుప్రియ
భాను ప్రియ కు మంచి క్లాసికల్ డాన్సర్ గా గుర్తింపు ఉంది.1991 తెలుగు సినిమా ‘శ్రీ ఏడుకొండల స్వామి’ మరియు 1997 ‘అన్నమయ్య’ సినిమాల్లో ఆమె రెండుసార్లు అలివేలు మంగమ్మగా నటించారు. ఆమె 1996 తెలుగు సినిమా అమ్మ దుర్గమ్మలో దుర్గాదేవిగా ప్రధాన పాత్రలో నటించింది.

#7. మీనా
మీనా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ,మలయాళం, కన్నడ లో కూడా ఎంతో పేరున్నా నటి. పార్వతీదేవిగా మీనా అలరించిన చిత్రం శ్రీ మంజునాథ. తెలుగులో దేవత అనే సినిమాలో దుర్గామాత అవతారమైన కోవెలమ్మ పాత్రను పోషించింది.

#8. శ్రీదేవి
బాలనాటిగా తెలుగు తెరకు పరిచయమైన శ్రీదేవి 1975లో యశోద కృష్ణ చిత్రంలో చిన్ని కృష్ణుడు పాత్రలో అందరి మనసులు దోచుకుంది.శ్రీదేవి తమిళ చిత్రం తిరువిదయాళ్‌లో దేవతగా వచ్చి రాజేష్ పాత్రకు చూపు తిరిగి ఇచ్చింది. 1984లో విడుదలైన ఆస్మాన్ సే గిరా చిత్రంలో శ్రీదేవి అటవీ దేవత పాత్రను పోషించారు. 1986లో వచ్చిన ఫాంటసీ హిందీ సినిమాలో నాగిన్ లో శ్రీదేవి చేసిన నాగ దేవత క్యారెక్టర్ అందరి మనసులో చెదరని ముద్ర వేసింది.

#9. సావిత్రి
తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటిగా వెలిగిన సావిత్రి కూడా కొన్ని సినిమాల్లో దేవతా పాత్రలో నటించి మెప్పించారు.భక్త పోతన చిత్రానికి ఆమె సరస్వతీ దేవి గా కనిపించగా తమిళ చిత్రం తిరువిళైయాడల్‌లో పార్వతి దేవిగా గా అందరినీ ఆకట్టుకున్నారు.

#10. కె.ఆర్.విజయ
కె.ఆర్.విజయ నటనా జీవితం వైవిధ్యమైనది. సినిమాల నుండి బుల్లితెర వరకు, హీరోయిన్ పాత్ర నుండి తల్లి వరకు అన్నింటిలోనూ నటి తనదైన ముద్ర వేసింది. అసలు సినిమా లో దేవత పాత్ర అంటేనే కె.ఆర్.విజయ అనే అంతగా ఆమె ఎన్నో చిత్రాలలో అమ్మవారి పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. త్రినేత్రం చిత్రంలో అమ్మవారిగా ఆమె నటన అందరినీ మెప్పించింది.

 


End of Article

You may also like