భర్తలను కోల్పోయిన 9 మంది టాలీవుడ్ నటీమణులు.!

భర్తలను కోల్పోయిన 9 మంది టాలీవుడ్ నటీమణులు.!

by Anudeep

Ads

వెండితెరపై కాంతులీనుతూ వారి కుటుంబాల్లో కళాకాంతులు పోగొట్టుకున్న.. అంటే వారి జీవిత భాగస్వామిని కోల్పోయినా ఒకప్పటి స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. మరి ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో వారి యొక్క జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి గురించి ఓ సారి చూద్దాం..

Video Advertisement

1. జయసుధ :


అప్పట్లో వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన నటి జయసుధ. ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ లతో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయసుధ 2017 లో తన భర్త నితిన్ కపూర్ ను కోల్పోయింది.

2. సుమలత:


శుభలేఖ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న సుమలత చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. సుమలత తన భర్త కన్నడ స్టార్ అంబరీష్ ను (2018) పోగొట్టుకున్నారు.

3. మీనా :


చంటి, సుందరకాండ, ముఠామేస్త్రి, ఇటీవల దృశ్యం2 మొదలగు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది మీనా. మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 29న హఠాత్తుగా మరణించారు.

4. భానుప్రియ:
హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న భానుప్రియ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించింది. తన భర్త ఆదర్శ కౌశల్ 2005లో మరణించారు.

5. రోహిణి :


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోహిణి అనేక సినిమాల్లో నటించారు. ఇటీవల అంటే.. సుందరానికీ, వరుడు కావలెను లో కూడా నటించారు. రోహిణి భర్త రఘువరన్ 2008లో మరణించారు.

6. సురేఖ వాణి :


అనేక సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ సురేఖ వాణి. తన భర్త సురేష్ తేజ 2019లో మరణించారు.

7. సీనియర్ యాక్టర్ కవిత:
టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న కవిత భర్త దశరథను 2021లో కరోనా వైరస్ బలితీసుకుంది.

8. డిస్కో శాంతి :
అలనాడు నటనతో మెప్పించిన డిస్కో శాంతి. తన భర్త రియల్ స్టార్ శ్రీహరిని 2013లో కోల్పోయింది.

9. మేఘనారాజ్ :


మేఘనారాజ్ కన్నడ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తెలుగులో చేసింది చాలా తక్కువ. తన భర్త చిరంజీవి సర్జా 2020 లో కోల్పోయింది.


End of Article

You may also like