టాలీవుడ్ డ్ర-గ్స్ కేస్ మళ్ళీ తెరపైకి…అసలు ఏం జరుగుతుంది?

టాలీవుడ్ డ్ర-గ్స్ కేస్ మళ్ళీ తెరపైకి…అసలు ఏం జరుగుతుంది?

by Mohana Priya

Ads

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌-గ్స్ వినియోగం, ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ వ్యాపారంపై నార్కోటిక్స్ బ్యూరో పూర్తిగా దృష్టి సారించడంతో ఇప్ప‌టికే పెద్ద డొంక క‌దిలింది. ఇటీవ‌ల కొన్ని వ‌రుస ఘ‌ట‌న‌ల్లో డ్ర‌-గ్ డీల‌ర్లు ప‌ట్టుబ‌డ్డారు. ఐదారు రోజుల క్రితం తెలంగాణాలో టాలీవుడ్ కి చెందినవారే ఎక్కువగా డ్ర-గ్స్ వినియోగిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Video Advertisement

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇంత‌కుముందు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసాక క‌మీష‌న‌ర్ తొలి పెద్ద ప్ర‌క‌ట‌న టాలీవుడ్ కి పెద్ద షాకింగ్ గా మారింది. సినీప్ర‌ముఖుల‌ను తీవ్రంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

film shootings halted in tollywood

కొత్త‌ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస రెడ్డి మొదట టాలీవుడ్‌ను టార్గెట్ చేయ‌డం ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌కు తెర తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మాట ఎక్కువ వినిపిస్తుంది అని, డ్రగ్స్ వాడకాన్ని టాలీవుడ్ ప్రోత్సహించ కూడదని క‌మీష‌న‌ర్ శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించ‌డంతో మ‌రోసారి తెలుగు చిత్ర‌సీమ‌లో డ్ర‌గ్స్ పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం దృష్టి సారిస్తోంద‌న్న చర్చా మొద‌లైంది.

భారీ డిమాండ్‌ ఉన్నందున హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందని కూడా శ్రీనివాస రెడ్డి అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు టాలీవుడ్ నాయకులు, సినీ పరిశ్రమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ డ్రగ్స్‌ను అడ్డుకునేందుకు పరిశ్రమలు కూడా చొరవ తీసుకుని సమావేశాలు నిర్వహించాలని సూచించా


End of Article

You may also like