రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటుడు కృష్ణుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటుడు కృష్ణుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

by Anudeep

Ads

వినాయకుడు మూవీ ఫేమ్ కృష్ణుడు అరెస్ట్ అయ్యారు. పేకాట కేసు లో కృష్ణుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని సమాచారం. సినీ నటుడు కృష్ణుడు తో పాటుగా మరో ఎనిమిది మంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే శిల్పా పార్క్ లో ఆయన పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది.

Video Advertisement

krishnudu 2

ప్రధాన నిర్వాహకుడైన పెద్ది రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి రైడ్ చేసారు. ఆట జరుగుతున్న స్థలం లో మొత్తం లక్షా 97 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది ఫోన్ లను సీజ్ చేసారు. అరెస్ట్ చేసిన వారందరిని మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు కు తరలించి అక్కడనుంచి రిమాండ్ లోకి తరలించారని సమాచారం.

krishnudu 1

కృష్ణుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కామెడీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విలేజ్ లో వినాయకుడు, షాక్, యువత, హ్యాపీ డేస్, జ్యోతి లక్ష్మి, ఆర్య 2 , స్నేహగీతం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోనూ అడుగుపెట్టి వైసీపీ పార్టీ తరపున పని చేస్తున్న సంగతి తెలిసిందే.

krishnudu 3

గతం లో కూడా కృష్ణుడు పై ఓ ఆరోపణ వచ్చింది. ఓ అమ్మాయి తనను 139 మంది దాదాపు ఐదువేల సార్లు రేప్ చేసారంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. వారి పేర్లలో కృష్ణుడి పేరు కూడా ఉండడం తో అందరు షాక్ అయ్యారు. దీనిపై స్పందించిన కృష్ణుడు ఈ వార్తను చూసి షాకయ్యానని, డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పారు. తాను చాలామందితో కలిసి పనిచేశానని.. కానీ ఎప్పుడూ తనపై ఇలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని, నాకు ఓ కూతురు ఉందని.. ఇలాంటి ఆరోపణలు చేసి లబ్ది పొందాలి అనుకుంటే.. దాని వల్ల జరిగే నష్టం చాలా మందిపై ప్రభావం చూపిస్తుందని బాధపడ్డారు.


End of Article

You may also like