టాలీవుడ్ కి రవితేజ పరిచయం చేసిన 8 మంది డైరెక్టర్లు వీరే.!! కొన్ని సినిమాలు హిట్..కొన్ని ఫట్.!

టాలీవుడ్ కి రవితేజ పరిచయం చేసిన 8 మంది డైరెక్టర్లు వీరే.!! కొన్ని సినిమాలు హిట్..కొన్ని ఫట్.!

by Mohana Priya

Ads

మన ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలలో సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు మాస్ మహారాజ్ రవితేజ. చిన్న పాత్రలతో తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు.  1990లో అభిమన్యు అనే కన్నడ సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టారు రవితేజ. ఆ తర్వాత కలెక్టర్ గారి అల్లుడు, వారసుడు, అల్లరి ప్రియుడు, సీతారామరాజు, పాడుతా తీయగా ఇంకా ఎన్నో సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించారు.

Video Advertisement

నీకోసం సినిమాలో సోలో హీరోగా నటించారు. తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా నటించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజని హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యారు రవితేజ.

puri jagannadh raviteja

తర్వాత ఇడియట్, ఖడ్గం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు రవితేజకి ప్రామిసింగ్ హీరో ఇమేజ్ తీసుకొచ్చాయి. తర్వాత వచ్చిన వెంకీ, విక్రమార్కుడు సినిమాలతో రవితేజ స్టార్ హీరోల జాబితాలో అడుగుపెట్టారు. రవితేజ  ప్రతి సినిమాకి ఒకేరకంగా కష్టపడతారు. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే. రవితేజ పర్ఫామెన్స్ కి మాత్రం వంక పెట్టడానికి ఉండదు.

ఇడియట్ లాంటి మాస్ రోల్స్ తో పాటు, వెంకీ లాంటి కామెడీ రోల్స్, శంభో శివ శంభో, నేనింతే, విక్రమార్కుడు లో విక్రమ్ సింగ్ రాథోడ్, షాక్ లాంటి సీరియస్ రోల్స్, నా ఆటోగ్రాఫ్ లాంటి సాఫ్ట్ రోల్స్ కూడా చేయగలరు రవితేజ. అయితే, రవితేజ తన సినిమాలతో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. అలా రవితేజ సినిమాల ద్వారా పరిచయమైన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 శ్రీను వైట్ల – నీ కోసం

#2 బోయపాటి శ్రీను – భద్ర

#3 ఎస్ గోపాల్ రెడ్డి – నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్

#4 యోగి – ఒక రాజు ఒక రాణి

#5 విక్రమ్ సిరికొండ – టచ్ చేసి చూడు

#6 హరీష్ శంకర్ – షాక్

#7 గోపీచంద్ మలినేని – డాన్ శీను

#8 కె.ఎస్.రవీంద్ర – పవర్

అలాగే ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాకి దర్శకుడు వహించిన అగత్తియన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ ఆయన అంతకు ముందు ఎన్నో తమిళ్ సినిమాలకి అలాగే ఒక హిందీ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.


End of Article

You may also like