తమ సినిమాల్లో తామే నటించిన 11 మంది డైరెక్టర్లు…వీరిలో ఎంతమందిని మీరు గమనించారు?

తమ సినిమాల్లో తామే నటించిన 11 మంది డైరెక్టర్లు…వీరిలో ఎంతమందిని మీరు గమనించారు?

by Anudeep

Ads

సినిమా అంటే.. ఆర్టిస్టులు తెర మీద కనిపించడానికి ఎంతోమంది టెక్నిషియన్స్ తెర వెనుక ఉండి సినిమా కోసం పని చేస్తారు. అందుకే  సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులు మాత్రమే తెర మీద కనిపిస్తారు. కానీ కొందరు డైరెక్టర్లు కూడా తమ సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించి, తమ అభిమానులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నారు.

Video Advertisement

ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఏ సినిమాల్లో కనిపించాడో ఓసారి చూద్దాం..

#1. వివి వినాయక్:

డైరెక్టర్ వినాయక్ ఆయన చేసిన అనేక సినిమాల్లో కనిపించారు. తొలిసారి చిరంజీవి సినిమా ఠాగూర్ లో కనిపించారు. ఆ తర్వాత మళ్లీ చిరు సినిమా ఖైదీ నెం. 150లో కూడా కనిపించారు.

#2. పూరీ జగన్నాథ్:

ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ మహేష్ బాబు హీరోగా వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాలో కనిపించారు. టాక్సీడ్రైవర్ గా వచ్చి హీరోయిన్ ను కిడ్నాప్ చేసే సీన్ లో కనిపిస్తారు. ఎన్టీఆర్ మూవీ టెంపర్, రామ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోనూ పూరీ కనిపించారు.

#3. క్రిష్ జాగర్లమూడి:

అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన వేదం సినిమాలో స్వామీజీ క్యారెక్టర్ చేశారు క్రిష్.

#4. శ్రీకాంత్ అడ్డాల:

ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్ శ్రీకాంత్ సైతం రెండు సినిమాల్లో కనిపించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాల్లో ఓ చిన్న గెటప్ వేశారు.

#5. సందీప్ రెడ్డి వంగ:

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో కనిపించారు దర్శకుడు సందీప్.

#6. ఓంకార్:

రాజు గారి గది సినిమాలో ఓ రోల్ చేశారు ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఓంకార్.

#7. శేఖర్ కమ్ముల:

ఫీల్ గుడ్ మూవీస్ తీసే శేఖర్ కమ్ముల కూడా పలు సినిమాల్లో కనిపించారు. “ఆనంద్” సినిమాలో ఆటో డ్రైవర్ గా చేశాడు. అటు “లీడర్” సినిమాలోనూ తెరపై మెరిసారు.

#8. రాజమౌళి:

దర్శకధీరుడు రాజమౌళి కూడా అనేక సినిమాల్లో కనిపించారు. మొదటిసారి నితిన్ సై సినిమాలో కనిపించారు. తర్వాత బాహుబలి సినిమాలో కల్లు అమ్మే వ్యక్తి పాత్రలో కనిపించారు.

#9. అనుదీప్ కే.వీ:

తన దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో ఓ క్యారెక్టర్ చేశారు అనుదీప్.

#10. శ్రీనువైట్ల:

తను డైరెక్టర్ గా చేసిన దుబాయ్ శ్రీను సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు శ్రీను వైట్ల.

#11. సురేందర్ రెడ్డి:

హీరో రవితేజ నటించిన కిక్ 2లో రవితేజతో కలిసి తెరమీద కనిపించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.


End of Article

You may also like