నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్ పై స్పందించిన ‘యంగ్ హీరో కార్తికేయ’ ఏమన్నారంటే ?

నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్ పై స్పందించిన ‘యంగ్ హీరో కార్తికేయ’ ఏమన్నారంటే ?

by Anudeep

Ads

నిన్న రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యారు. ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మూవీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ స్పీచ్ తాలూకు వీడియో కొద్దీ సేపటికే చాలా వైరల్ అయింది. నెటిజన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికీ కొందరు నెగటివ్ గా కామెంట్స్ చేసారు. సెలెబ్రిటీలు కూడా ఒక్కొక్కరే పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి స్పందిస్తూ వస్తున్నారు.

Video Advertisement

karthikeya 2

పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు యావత్ సినిమా ఇండస్ట్రీ ని ఆలోచనలో పడేశాయి. అభిమానులతో సహా పలువురు సెలెబ్రిటీలు సైతం ఆయనకు మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తాజాగా RX 100 మూవీ తో పాపులారిటీ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో కార్తీకేయ కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై స్పందించారు.

karthikeya 2

“నేను ఏ రాజకీయ పార్టీ కి వ్యతిరేకం గా గాని, సపోర్ట్ చేస్తూ కానీ మాట్లాడట్లేదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ సర్ స్పీచ్ విన్నాక, ఈ విషయం లో పవన్ సర్ కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత అని భావిస్తున్నా..” అంటూ హీరో కార్తికేయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.


End of Article

You may also like