టాలీవుడ్ హీరో రెండో సారి పెళ్ళికి సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. తొందరలోనే ఆయన వివాహం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. రెండో సారి వివాహ బంధం తో సుమంత్ ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబానికి సన్నిహితులైన ఓ బిజినెస్ మాన్ కుమార్తె అయిన పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

sumanth

మరో వైపు ఇప్పటికే పెళ్లి పనులను ప్రారంభించేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నెట్టింట్లో ఓ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. ఎస్ , పి అనే అక్షరాలు హైలైట్ అవుతూ ఈ పెళ్లి కార్డు డిజైన్ చేయబడుతోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. గతం లో 2004 లో కీర్తిరెడ్డి ని వివాహం చేసుకున్న సుమంత్.. ఆమెతో గొడవ కారణం గా విడిపోయిన సంగతి తెలిసిందే.