24 గంటల్లో అత్యంత ఎక్కువ లైక్స్ సొంతం చేసుకున్న టాప్ 10 టాలీవుడ్ మూవీ ట్రైలర్స్ ఇవే..! లిస్ట్ ఓ లుక్ వేయండి..!

24 గంటల్లో అత్యంత ఎక్కువ లైక్స్ సొంతం చేసుకున్న టాప్ 10 టాలీవుడ్ మూవీ ట్రైలర్స్ ఇవే..! లిస్ట్ ఓ లుక్ వేయండి..!

by Anudeep

ఒకప్పుడు రికార్డు సృష్టించడం అంటే.. సినిమాలు రెండొందల రోజులు, మూడొందల రోజులు ఆడిన లెక్కలుండేవి.. కొన్ని రోజులకు ధియేటర్ల నెంబర్ పెరుగుతూ వచ్చే సరికి.. ఓ సినిమా ఎన్ని థియేటర్లలో వందరోజులు ఆడింది అన్న లెక్కలు కట్టడం మొదలెట్టారు. ఆ తరువాత వంద కోట్ల క్లబ్ వచ్చింది. ఏ సినిమా అయినా వంద కోట్ల కలెక్షన్ సాధిస్తే.. ఆ సినిమా హిట్టు కిందే లెక్క.

Video Advertisement

youtube likes

అయితే, ప్రస్తుతం మాత్రం రికార్డుల లెక్క మారింది. సినిమా రిలీజ్ కి ముందు నుంచే రికార్డుల వరద మొదలవుతోంది. టీజర్, ట్రైలర్ లకు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్న దానిపైనా, ప్రీ బుకింగ్ ఎంత బిజినెస్ జరిగింది, డిజిటల్ రైట్స్ ఇంతకు అమ్ముడుపోయాయి.. ఇలా ప్రతిదీ సినిమా లెక్కల్ని తేల్చేస్తుంది. సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా రికార్డ్స్ అనేవి ఫుల్ హై రేంజ్ లో ఉన్నాయి.. సోషల్ మీడియా రికార్డ్స్ ప్రకారం ఏ సినిమా ఎక్కువ రికార్డ్స్ సొంతం చేసుకుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి ట్రెండ్ ప్రకారం, యూట్యూబ్ లో ఏ వీడియో కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఎక్కువ లైక్స్ వచ్చాయి అన్న దానిపైనే రికార్డు లు సృష్టించేస్తున్నారు. ఏ మూవీ ట్రైలర్ కు ఎన్ని లైక్స్ వచ్చాయో.. లిస్ట్ చూడండి..

#10 : అజ్ఞాతవాసి:

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే, ఈ సినిమా ట్రైలర్ కి ఒక్క రోజులో 272K లైక్స్ వచ్చాయి. పవర్ స్టారా మజాకానా అంటే ఇదేమరి.

#9 : ఉప్పెన:

మెగా హీరో వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కి ముందు నుంచే హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా ట్రైలర్ కి ఒక్క రోజులో 284.5K లైక్స్ వచ్చాయి.

#8 : జాతిరత్నాలు:

కామెడీ ఎంటర్టైనర్ గా హిట్ టాక్ తెచ్చుకున్న జాతిరత్నాలు సినిమా 24 గంటల్లో 315K లైక్స్ ను సొంతం చేసుకుంది.

#7 : అల వైకుంఠపురములో :

బన్నీ, త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన ఈ సినిమా కు ఒక్క రోజులో 326K లైక్స్ వచ్చాయి.

#6 : అరవింద సమేత

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల కాంబో లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా కు ఒక్క రోజులో 327K లైక్స్ రావడం విశేషం.

#5 సైరా:

మెగాస్టార్ సెకండ్ ఇన్గింగ్స్ లో రికార్డు లతో దూసుకెళ్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు ఒక్క రోజులో 341K లైక్స్ వచ్చాయి.

#4 : సరిలేరు నీకెవ్వరు:

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా “సరిలేరు నీకెవ్వరు” కూడా 24 గంటల్లో 347K లైక్స్ సొంతం చేసుకుంది.

#3 సాహో:

ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా సాహో కు 24 గంటల్లో 392K లైక్ లు రావడం గమనార్హం.

#2 బాహుబలి2 :

బాహుబలి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కు కూడా రిలీజ్ అయిన 24 గంటల్లో 497 K లైక్స్ వచ్చాయి.

#1 వకీల్ సాబ్:

పవర్ స్టార్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ హవా ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కు.. 24 గంటల్లో 1.006M* లైక్స్ వచ్చాయంటే పవన్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అర్ధమవుతోంది.


You may also like