Ads
బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిర్మాతగా, కమెడియన్ గా బండ్లన్న ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పుడప్పుడు తన కామెంట్స్ తో వార్తల్లో కూడా వైరల్ అవుతూ ఉంటారు బండ్లన్న. తాజాగా.. బండ్ల గణేష్ మరో కొత్త ప్రయత్నం చేసారు. ఆయన హీరోగా ఓ సినిమాలో నటించారు.
Video Advertisement
“డేగల బాబ్జి” గా బండ్ల గణేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు వెంకట చంద్ర దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కు ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది.
#1.
#2.
#3.
#4.
#5.
ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో శిక్ష అనుభవిస్తున్న డేగల బాబ్జిగా ఈ సినిమాలో బండ్లన్న కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లోనే బండ్లన్న విశ్వరూపం చూపించేసారు. “పుట్టగానే వాడు ఏడవలేదు.. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం..” అంటూ బండ్లన్న చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
#6.
#7.
#8.
#9.
#10.
ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. బండ్లన్న లుక్ పై కూడా సోషల్ మీడియా లో మీమ్స్ వస్తున్నాయి.. ” బ్లేడ్ బాబ్జి” అని టైటిల్ పెట్టాల్సింది అంటూ కొందరు ట్రోల్ చేస్తుండగా.. మరికొందరేమో అన్న ఫేస్ పై 7 ‘o క్లాక్ బ్లేడ్ తో కట్ చేసినట్లున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బండ్లన్నలో ఇంత ఫైర్ ఉందని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “డేగల బాబ్జి” ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
End of Article