Ads
భారత్ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కరెన్సీ విషయంలో కూడా భారత్ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. నగదు చెల్లింపుల కంటే.. డిజిటల్ చెల్లింపులకు ప్రస్తుతం ఎక్కువమంది ఓటేస్తున్నారు. ఈ క్రమం లో పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆప్ లకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. వీటిల్లో ఫోన్ పే అప్లికేషన్ ఇండియన్ అప్లికేషన్.
Video Advertisement
దీనితో.. చాలా మంది యూజర్లు ఫోన్ పే అప్లికేషన్ ను వినియోగిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లు వచ్చిన మొదట్లో ట్రాన్సాక్షన్ చేసినందుకు స్క్రాచ్ కార్డు లు ఇచ్చేవారు. ఈ స్క్రాచ్ కార్డు లను ఓపెన్ చేస్తే ఎంతో కొంత క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుండేది. దీనితో.. ఈ యాప్ లకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ప్రస్తుతం ఫోన్ పే ను వాడే వారి సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. ఈ క్రమంలో ఫోన్ పే అప్లికేషన్ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. రీచార్జి చేస్తే రెండు రూపాయలు ఎక్స్ట్రా గా ఛార్జ్ చేయనున్నారు. GST కింద ఈ టాక్స్ ను కట్టించుకుంటారట. రీఛార్జి చేయడానికి రెండు రూపాయలు టాక్స్ కట్టాలా..? అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు వందరూపాయల వరకు ట్రాన్సాక్షన్ కి వన్ రూపీ, వంద కంటే ఎక్కువ రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినందుకు రెండు రూపాయలు టాక్స్ చెల్లించాలట. దీనితో నెటిజన్స్ ఫోన్ పే పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.
#2.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article