Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.
Video Advertisement
ప్రేక్షకులు అందరూ ఆర్ఆర్ఆర్ టీజర్ ఎప్పుడు వస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. “ఆర్ ఆర్ ఆర్” చిత్రం నుంచి టీజర్ విడుదల అయ్యింది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ లో రాజమౌళి మార్క్ కనిపించింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి లుక్స్ విడుదల చేసినప్పుడే సెన్సేషన్ అయింది. ఇక టీజర్ లో వారిని చూసిన టైం లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలియా, ఒలీవియా లు కూడా టీజర్ లో కనిపిస్తారు.
దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ పై సోషల్ మీడియా లో కూడా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
ఈ టీజర్ కేవలం 45 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైం లోనే రచ్చ రచ్చ చేసి చూపించారు అంటూ కొందరు కితాబిస్తుంటే.. కొందరు నెటిజన్స్ మాత్రం మరీ ఇంత తక్కువ టైం లో టీజర్ ఇస్తారా? అంటూ ఫీల్ అవుతున్నారు.
#7.
#8.
#9.
#10.
#11.
నిజంగా ఈ టీజర్ చూస్తుంటే.. 45 సెకండ్స్ ఇంత ఫాస్ట్ గా అయిపోయాయి ఏంటి..? అనిపించడం మాత్రం ఖాయం. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను ఈ టీజర్ మరింత పెంచింది. జనవరి 7 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆరోజు కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
#12.
#13.
తక్కువ టైం లోనే ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది ఆర్ ఆర్ ఆర్ టీజర్. విడుదల అయిన కాసేపటిలోనే సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#14.
#15.
End of Article