Ads
ఒక యాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో ఏళ్ళు శ్రమించాలి. ఎన్నో ఆడిషన్లు ఇవ్వాలి. అలా కొన్ని సంవత్సరాలు కష్టపడితే మొదటి అవకాశం వస్తుంది. తర్వాత మనం చూపించే ప్రతిభను బట్టి మన కెరీర్ ముందుకు సాగుతుంది. ప్రతిదానికి షార్ట్ కట్ వెతికే జనాలు దీనికి కూడా షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకున్నారు. అదే టిక్ టాక్. ముందు ఏదో సరదాకి జనాలు ఈ యాప్ ని ఉపయోగించేవారు. కానీ తర్వాత ఇది ఒక వ్యసనం అయిపోయింది.
Video Advertisement
సినిమా డైలాగులు చెప్పడం, పాటలకి డాన్స్ చేయడం మాత్రమే కాకుండా వింత కాన్సెప్ట్ లతో వింత వీడియోలు చేశారు. మిగిలిన వాళ్ళు వీటిని ఇంకా ప్రోత్సహించారు. ఒకపక్క యూట్యూబ్ లో వీళ్ళ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా అవి మాకు ఇంకా పబ్లిసిటీ ఇస్తాయి అని చాలా పాజిటివిటీ తో ఇంకా ఎక్కువ వీడియో చేసేవాళ్ళు. ఎంత ట్రోల్స్ వస్తే అంత పాపులర్ అన్నమాట.
వీళ్ళకి ఉన్న ఫాలోవర్లను చూసి ఎన్నో కంపెనీలు తమ వస్తువులను వాళ్లతో అడ్వర్టైజ్ చేయించుకునే వాళ్ళు. దాంతో ఫాలోవర్ల తో పాటు డబ్బులు కూడా వచ్చేవి. టాలెంట్ ని చూపించాల్సిన టీవీ షోలు కూడా గెస్ట్ అప్పియరెన్స్ గా వీళ్ళని పిలుస్తారు. కొంతమంది సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఆప్ ని ప్రమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఒకవేళ వీళ్లు నిజంగా యాక్టర్ లో అవ్వాలి అనుకుంటే టిక్ టాక్ మాత్రం దారి కాదు అని చాలా మంది డైరెక్టర్లు చెప్తున్నారు. కామెడీకి వెకిలితనం కి మధ్య ఒక సన్న గీత ఉంది. అది దాటితే చూసే జనాలకు చిరాకు వస్తుంది.
అలాంటి హద్దులన్ని మర్చిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళు లాగా తయారయ్యి వింతగా ప్రవర్తిస్తారు. అలాంటివాళ్లు టిక్ టాక్ లో ఎంతో మంది ఉన్నారు. దీనివల్ల ఉండే ఉపయోగాలు నష్టాలు పక్కనపెడితే టిక్ టాక్ ని ఇటీవల భారతదేశంలో బ్యాన్ చేశారు. దాంతో ఎంతోమంది తమ ఆగ్రహాన్ని, బాధని వ్యక్తం చేశారు. టిక్ టాక్ స్టార్లలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది వీళ్లే.
#1 భాను
#2 దీపిక పిల్లి
#3 మెహబూబ్
#4 దీప్తి సునైనా
#5 నాయని పావని
#6 ఫన్ బకెట్ భార్గవ్
#7 సుప్రీత నాయుడు
#8 ఉప్పల్ బాలు
#9 గోదావరి కుర్రాడు
#10 రేవతి రెడ్డి
#11 పవన్ హరి
#12 దివ్య శ్రీ
#13 వర్షిని
#14 ప్రషు 223
#15 నందు రామిశెట్టి
#16 గీతు రాయల్
#17 కాగజ్ నగర్ సాయి
#18దుర్గారావు
#19 ప్రేమలత
#20 బంజారాహిల్స్ ప్రశాంత్
వీళ్లే కాకుండా సీరియల్స్ లో, యూట్యూబ్ లో,సినిమాల్లో సహాయ నటుల పాత్రలు చేసి పాపులర్ అయిన ఎంతోమంది టిక్ టాక్ లో కూడా పాపులర్ అయ్యారు.
తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం!
>>>CLICK HERE FOR DETAILS<<<
End of Article