Ads
సినిమా నటులు చాలా మంది సినిమాల్లోకి రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. అంటే, అంతకు ముందు లావుగా ఉండడం, సినిమాల్లోకి రావడానికి సన్నబడడం, ఇంకా నటనకు సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, డాన్స్, ఫైట్స్ లాంటివి నేర్చుకోవడం చేస్తుంటారు.
Video Advertisement
కొంత మంది ఈ విషయాలన్నిటినీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే, కొంత మంది మాత్రం సినిమాల్లోకి వచ్చే ముందు వీటిపై అవగాహన పెంచుకుంటారు.
చాలా మంది హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒకలాగా ఉంటారు. అలా ఒక హీరోయిన్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తిని గమనించారా? ఈమె ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాల్లో నటిస్తున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యారు.
ఆమె మరెవరో కాదు అదితి రావు హైదరీ. అదితి బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో చేసారు. తెలుగులో సమ్మోహనం సినిమాతో పాటు వి, మహాసముద్రం సినిమాల్లో నటించారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో హే సినామికా అనే ఒక తమిళ్ సినిమాలో నటించారు. అలాగే మరి కొన్ని తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించారు. అదితి తెలుగు కుటుంబానికి చెందిన వారు. అదితి పూర్వికులు వనపర్తికి చెందిన వారు. అందుకే అదితికి హిందీతో పాటు తెలుగు కూడా వచ్చు. సమ్మోహనం, వి సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.
End of Article