టాప్ 10 మోస్ట్ డిజైరబుల్ ఉమన్ 2019 వీరే.! సమంత తెలుసు…మిగిలిన వారు ఎవరో చూడండి!

టాప్ 10 మోస్ట్ డిజైరబుల్ ఉమన్ 2019 వీరే.! సమంత తెలుసు…మిగిలిన వారు ఎవరో చూడండి!

by Anudeep

Ads

“టైమ్స్ ఆఫ్ ఇండియా” ప్రతి సంవత్సరం ప్రకటించే లిస్టుని  2019కి గానూ ప్రకటించింది. “మోస్ట్ డిసైరబుల్ వుమన్-2019 ”  టాప్ వన్ స్టానాన్ని సొంతం చేసుకున్నారు సమంతా . ఈ కాంటెస్ట్ తమ అందం , టాలెంట్ తోపాటు అభిమానుల ఫాలోయింగ్ పైన ఆధారపడి ఉంటుంది. 2019 కిగానూ సమంతసెలక్ట్ అయింది. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఈ టైటిల్ ని అందచేస్తారు.

Video Advertisement

సుమారు ముప్పై మందిని మోస్ట్  డిసైరబుల్ ఉమన్ గా ప్రకటించిన హైదరాబాద్ టైమ్స్, అందులో ఆన్ లైన్ ఓటింగ్ ని బట్టి ర్యాంక్స్ ని కేటాయించింది. మిస్ తెలంగాణా 2019 గా సెలక్ట్ అయిన సంజన రెండో స్థానాన్ని కైవసం చేస్కోగా, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సిందు మూడో స్థానాన్ని దక్కించుకుంది. సమంత తర్వాత స్థానాల్లో సినిమా ఇండస్ట్రీ నుండి అదితి రావు హైదరీ, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ మరియు రక్షితా మందనా టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు.

1.సమంత అక్కినేని

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతా అక్కినేని, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ, ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఇటీవల సమంత నటించిన ఓహ్ బేబి, రంగస్థలం, మజిలి మరియు సూపర్ డీలక్స్(తమిళ్) సినిమాలు సమంతాకి చాలా పేరు తీసుకొచ్చాయి.  నాగచైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని కుటుంబానికి కోడలు అయినప్పటికి పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పకుండా , మరింత పరిణతితో పాత్రల్ని ఎంచుకుంటూ స్టీరియో టైప్స్ కి చెక్ పెట్టింది సమంతా.

2.సంజన vij

ఢిల్లీకి చెందిన సంజన రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈమె గతంలో మిస్ ఇండియా తెలంగాణా 2019 అవార్డుని కూడా సొంతం చేసుకుంది.

Also Check:  SANJANA VIJ  IMAGES

3.పివి సింధు

బ్యాడ్మింటన్లో భారత పతకాన్ని ప్రపంచం నలుమూలలా ఎగరేసిన ఘనత పివి సింధు సొంతం, ఎన్నో టోర్నమెంట్స్ మరెన్నో మెడల్స్ తో దూసుకుపోతున్న పివి సింధు ధర్డ్ మోస్ట్ డిసైరబుల్ పర్సన్.

4.అదితి రావు హైదరీ

హైదరాబాద్ బిడ్డ అదితి అటు బాలివుడ్, ఇటు తమిళ, మళయాలం, తెలుగు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి.తమిళ్ నుండి పోటీ చేసిన నయన తార, ఐశ్వర్య రాజేశ్ మరియు అమలాపాల్ లాంటి ఎందరినో వెనక్కి నెట్టి ఫోర్త్ డిసైరబుల్ ఉమన్ గా సెలక్ట్ అయింది హైదరీ. తెలుగులో సుధీర్ బాబు సరసన సమ్మోహనంలో నటించింది అదితి. కేవలం నటన మాత్రమే కాదు, మంచి సింగర్, డ్యాన్సర్ కూడా.

5.పూజా హెగ్డే

ఫిఫ్త్ డిజైరబుల్ ఉమన్ టైటిల్ సొంతం చేసుకున్న నటి పూజా హెగ్డే . తెలుగులో అందరు యువహీరోలతో నటించిన పూజా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుణ్ తేజ్ సరసన నటించిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూజా, దువ్వాడ జగన్నాదం సినిమా నుండి తన అందంతో కుర్రకారు గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తుంది.

6.రాజకుమారి

శ్వేతా ఎల్లాప్రగడ అలియాస్ రాజకుమారి ఇండో అమెరికన్ పాటల రచయిత మరియు సింగర్. ఆరవ స్థానం రాజకుమారిది.

7.రకుల్ ప్రీత్ సింగ్

ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి టాప్ టెన్ లో చోటు దక్కించుకుని ఏడవ స్థానాన్ని పొందింది రకుల్. తెలుగుతో పాటు హింది , కన్నడ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇటీవల తెలంగాణా రాష్ట్రం తరపున బేటి బచావో-బేటి పడావో ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది.

8.కాజల్ అగర్వాల్

లక్ష్మీ కళ్యాణం మొదలు కొని దశాబ్దం కి పైగా ఎన్నో చిత్రాల్లో నటించిన కాజల్ ఇప్పటికి తన అందంతో అందరిని మైమరిపింపచేస్తుందనడానికి ఎనిమిదో స్థానమే ఉదాహరణ.

9.రశ్మిక మందన్నా

కన్నడ నటి రశ్మిక మందన్నా తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా దూసుకుపోతోంది. 2019లో మహేశ్ సరసన నటించిన సరిలేరు నీకెవ్వరూతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించి లవ్లీ పెయిర్ గా పేరు సంపాదించారు.

10.నికితా తన్వాని

నికితా తన్వాని డిజైనర్ మరియు మోడల్. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్న నికితా  మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2019 గా సెలక్ట్ అయింది.

 


End of Article

You may also like