Ads
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు ఆర్మీ అభ్యర్థులు. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ వదిలారు. అయినప్పటికీ ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ అభ్యర్థి రాకేష్ మరణించాడు.
Video Advertisement
ఆందోళన కారులను కట్టడి చేసిన పోలీసులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నాలుగు వైపుల నుంచి కమ్మేసి.. ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన ఆర్మీ అభ్యర్థులను చంచల్‌గూడ జైలు తరలించారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో అరెస్టయిన యువకులతో ములాఖత్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు రేవంత్ రెడ్డి.
మరోవైపు అరెస్టయిన యువకుల కోసం న్యాయవాదులను నియమించినట్టు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఆందోళనలో మృతి చెందిన ఆర్మీ అభ్యర్థి రాకేష్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు రాకేష్ కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించింది. అంతేకాకుండా రాకేష్ అంతిమయాత్రలో టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు పాల్గొని నివాళులు అర్పించారు.
End of Article