Ads
లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు లేకపోవడంతో సినిమాలు, సీరియల్స్ అన్ని ఆగిపోయాయి..ఛానల్స్ అన్ని రకరకాల సినిమాలతో పాటు , పాత సీరియల్స్ ను ఫస్ట్ ఎపిసోడ్ నుండి మళ్లీ ప్రారంబించాయి..అలా సెకండ్ టైం ప్రారంభమయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్ “రామాయణ్.”. రీ-టెలికాస్ట్ అయిన రామాయణ్ ది టాప్ ప్లేస్ మాత్రమే కాదు..ఈ సీరియల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతోంది..అదేంటంటే..
Video Advertisement
ఇప్పుడంటే సీరియల్స్ పై ఇంత ఏవగింపు వచ్చింది కానీ..ఒకప్పుడు సీరియళ్లను ఇంటిల్లిపాది కూర్చుని చూసేవారు.అంతేకాదు తర్వాత ఎపిసోడ్ ఏంటా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లు..అందులోనూ దేవుడి సీరియల్ అంటే ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.. రామాయణ్ సీరియల్ 1987లో దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది..ప్రతి ఆదివారం వచ్చే ఈ సీరియల్ సింగిల్ ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసేవాళ్లు..
ఇదే విషయంపై నెట్లో వైరలవుతోన్న ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే “ బీహార్ రాష్ట్ర రాజధానీ పాట్నా నుండి ఢిల్లీకి వెళ్లే ఒక ట్రెయిన్ టైమింగ్స్ , సీరియల్ టెలికాస్ట్ టైం ఒకటే కావడంతో..రాంపూర అనే స్టేషన్ దగ్గర ట్రెయిన్ ని ఆపి స్టాఫ్, ప్రయాణికులు అందరూ సీరియల్ చూసిన తర్వాత ట్రెయిన్ బయల్దేరేది..నిజానికి రాంపురా లో ట్రైయిన్ ఆగడానికి హాల్ట్ లేకపోయినప్పటికి, కేవలం రామాయణం చూడడం కోసమే , ఆదివారం పూట అక్కడ ట్రెయిన్ ఆపేవారు.. సీరియల్ అయిపోయిన తర్వతా ట్రెయిన్ బయల్దేరేది.
ఈ విషయాన్ని రామాయణ్ సీరియల్ డైరెక్టర్ రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్ రాసిన పుస్తకం “యాన్ ఎపిక్ లైఫ్ – రామానంద్ సాగర్ .. ఫ్రం బర్సాత్ టు రామాయణ్ ” లో శేర్ చేసుకున్నారు. లాక్ డౌన్ కాలంలో రీ టెలికాస్ట్ చేయబడిన రామాయణ్ అన్ని రికార్డులన బద్దలుకొట్టి 77 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది..
End of Article