Ads
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు వచ్చి.. బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత వీరిద్దరూ తీసిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు మరే సినిమాకు రానంత హైప్ ఉంది. రికార్డు స్థాయి బిజినెస్. . పైగా పండగ సీజన్. దీంతో ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ చివరికి ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
Video Advertisement
ఎవరూ ఊహించని రేంజ్‌లో అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. పైగా ఫ్లాపుల్లో ఆల్‌టైమ్ రికార్డులు సెట్ చేసింది. ఈ సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయిపోయింది. పవన్ కెరీర్‌లోనే కాదు.. త్రివిక్రమ్ కెరీర్‌లో కూడా ఎప్పటికీ మాయని మచ్చ అజ్ఞాతవాసి. కలలో కూడా ఊహించని ఫ్లాప్ ఇది. అంత దారుణంగా సినిమా డిజాస్టర్ అవుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఉన్న అంచనాలు తారాస్థాయిలో ఉంటే.. విడుదల తర్వాత అవి పాతాళానికి పడిపోయాయి.
అజ్ఞాతవాసి 58 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది. అయినా కూడా డిజాస్టర్ టాక్‌తోనే 57 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 98 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే సినిమా రేంజ్‌కు ఇది సరిపోదు. నాన్ బాహుబలి కేటగిరీలో అప్పటి వరకు ఏ తెలుగు సినిమా చేయని బిజినెస్ చేసింది ఈ చిత్రం. పవన్ 25వ సినిమా కదా అని కోట్లాది ఆశలతో వచ్చిన అభిమానుల ఆశలపై నిండా నీళ్లు పోసాడు త్రివిక్రమ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాసమే అజ్ఞాతవాసి కొంప ముంచేసిందని అప్పట్లో గగ్గోలు పెట్టారు విశ్లేషకులు.
అయితే తాజాగా అజ్ఞాతవాసి చిత్రం ఐదేళ్లు అయిన సందర్భంగా నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి..వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article