Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
పాన్ ఇండియా లెవల్లో ఆదిపురుష్ సినిమా విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ తో అంచనాలు పెరిగిపోయాయి.
ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది. ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్. దీనికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన జీయర్ స్వామి హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే చిత్రం యూనిట్ రెండున్నర కోట్ల రూపాయలను వ్యయం చేసింది. 50 లక్షల రూపాయల విలువ చేసే బాణాసంచాను సిద్ధం చేసింది. తిరుపతిలో ఆదిపురుష్ మేనియా కమ్ముకుంది. ఎటు చూసినా ప్రభాస్ బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు కనిపిస్తున్నాయి. రామబాణాన్ని ఎక్కు పెట్టిన శ్రీరాముడి గెటప్‌లో ఉన్న నిలువెత్తు కటౌట్లను ఏర్పాటు చేశారు అభిమానులు.
ఇక తాజాగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18
End of Article