Ads
అనుష్క శెట్టి మూడేళ్ల గ్యాప్ తర్వాత ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో `జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. అనుష్కకి జోడీగా నవీన్ పొలిశెట్టి చేస్తుండటం విశేషం. దీంతో సినిమా ప్రకటించినప్పట్నుంచే దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌బాబు అనే నూతన దర్శకుడు దీన్నిరూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది టీమ్. దీనికి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
Video Advertisement
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇందులో అనుష్క ఓ పుస్తకం పట్టుకుని తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయి ఏదో ఆలోచిస్తుంది. మరోవైపు గోడపై కూర్చొని నవీన్ పొలిశెట్టి తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయారు. ఊహల్లో తేలియాడుతున్నాడు. అయితే అనుష్క లండన్‌లో ఉండగా, నవీన్ హైదరాబాద్‌లో ఉండటం విశేషం. మరి వీరిద్దరికి ఎలా కనెక్షన్ కుదిరింది. మరి వీరిద్దరి కథేంటి అనేది ఆసక్తికరంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం ఓ రోలర్ కోస్టర్‌గా ఫన్ రైడర్‌గా ఉండనుందని సమాచారం.
అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్రబృందం. ఈ టైటిల్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా క్యాచీగా ఉండటంతో పాటు సినిమా కథకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోయేలా ఉంటుంది అని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాలో నవీన్.. సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే చెఫ్ పాత్రలో నటించారు. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
భాగమతి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క మళ్ళీ ఇన్నాళ్లకు మరో ఆసక్తికరమైన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తీసుకొని ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
అయితే తాజాగా రిలీ అయిన ఫస్ట్ లుక్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article