మహేష్ బాబు “గుంటూరు కారం” ఫస్ట్ సాంగ్ పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

మహేష్ బాబు “గుంటూరు కారం” ఫస్ట్ సాంగ్ పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mounika Singaluri

Ads

మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం మీద ముందు నుండి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Video Advertisement

అయితే గుంటూరు కారం సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి ఏదో ఒక ఆటంకం వచ్చేది. ఒకసారి ఫైట్ సీన్ మొత్తం స్క్రాప్ చేశారని అన్నారు. మరోసారి హీరోయిన్ పూజ హెగ్డే ని మార్చేస్తున్నట్లు వచ్చింది, అదే నిజమైంది. తర్వాత కెమెరామెన్ చేంజ్ అయ్యాడు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో కూడా చాలా రోజులపాటు సందిగ్ధత నెలకొంది. ఆఖరికి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడితే నిర్మాతలు వాటికి చెక్ పెడుతూ జనవరి లో సంక్రాంతి కానుకగా 12 తారీఖున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా బాగుంది. గత కొద్ది సినిమాలుగా రొటీన్ గా కనబడుతున్న మహేష్ ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. కాకపోతే విడుదలైన ప్రతి పోస్టర్లను బీడీతో కనిపించేసరికి దాని పైన కూడా సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటికే సినిమా ఆల్మోస్ట్ 50% పైనే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని త్రివిక్రమ్ బర్త్డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రోమో విడుదలైనప్పటినుండి వీటి పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫుల్ సాంగ్ విడుదలైన తర్వాత ఆ ట్రోల్స్ ఇంకా పెరిగాయి. ముఖ్యంగా లిరిక్స్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి విపరీతంగా మీమ్స్ వేస్తున్నారు. ఈ సినిమా పైన వైరల్ అవుతున్న టాప్ మీమ్స్ ఒకసారి చూద్దాం….!

1.

2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12.13.

14.

15.

16.17.

18.

watch video :

Also Read:“కమల్ హాసన్” కొత్త సినిమాని… ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి ఏంటంటే..?


End of Article

You may also like