“కమల్ హాసన్” కొత్త సినిమాని… ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి ఏంటంటే..?

“కమల్ హాసన్” కొత్త సినిమాని… ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి ఏంటంటే..?

by Mohana Priya

Ads

భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మొదటి స్థానంలో ఉండే నటుడు కమల్ హాసన్. కమల్ హాసన్ స్వతహాగా తమిళ్ వారు అయినా కూడా, మిగిలిన భాషల్లో కమల్ హాసన్ సినిమాలకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

Video Advertisement

ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడగలరు. సినిమాకి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే కమల్ హాసన్ చేయగలరు. ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా, డాన్సర్ గా, రచయితగా, మేకప్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాల వృత్తుల్లో కమల్ హాసన్ కి పరిజ్ఞానం ఉంది.

comments on thug life title announcement video

ఆల్ రౌండర్ అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనం అంటే కమల్ హాసన్ మాత్రమే ఏమో. అంతే కాకుండా, ఇటు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ కూడా చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా, తన సొంత బ్రాండ్ ప్రారంభించి ఖద్దర్ దుస్తులకు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాల పనులు చేస్తూ ఒక మంచి ఆర్టిస్ట్ గా, ఒక మంచి వ్యక్తిగా కమల్ హాసన్ పేరు తెచ్చుకున్నారు.

comments on thug life title announcement video

అయితే కమల్ హాసన్ ఇవాళ తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు కమల్ హాసన్ కి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నంతో కలిసి సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా నిన్న ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న వీడియో విడుదల చేశారు.

comments on thug life title announcement video

అందులో కమల్ హాసన్ కొంత మందితో ఫైటింగ్ చేస్తూ కనిపించారు. ఈ సినిమా పేరు థగ్ లైఫ్ అని ప్రకటించారు. ఇందులో దుల్కర్ సల్మాన్, త్రిష కృష్ణన్, జయం రవి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోకి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో మరొక విషయం కూడా వార్తల్లో నిలిచింది.

comments on thug life title announcement video

అదేంటి అంటే, ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో, 2019 లో విడుదల అయిన రైజ్ ఆఫ్ స్కై వాకర్ అనే సినిమాకి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కేవలం ఈ వీడియో ఇలా ఉంటే పర్వాలేదు. కానీ సినిమా మాత్రం దీనికి రీమేక్ అవ్వకుండా ఉంటే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : విజయ్ దేవరకొండ ఫేమస్ సీన్ ట్రై చేశారు..! కానీ చివరికి ట్విస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!


End of Article

You may also like