2017 నుంచి దాదాపు ఆరేళ్లు కార్తీక దీపం సీరియల్ నిరంతరాయంగా ప్రసారం అయ్యి.. జాతీయ స్థాయిలో నెంబర్ సీరియల్‌గా అనేక రికార్డుల్ని క్రియేట్ చేసి.. బుల్లితెర బాహుబలిగా అవతరించింది. ఇంతటి టీఆర్పీల పెద్ద పెద్ద సినిమాలకూ దక్కలేదేమో. ఇంట్లో ముసలవ్వ నుంచి పిల్లాడి వరకూ.. ఈ సీరియల్ కనెక్ట్ అయింది. మగాళ్లలోనూ ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో వంటలక్క.. అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. సీరియల్ ఇంతటి స్థాయిలో సక్సెక్ అయ్యేందుకు ఆమె కూడా ప్రధాన కారణం. ఆమెకు జంటగా డాక్టర్ బాబు.. నిరుపమ్ నటించాడు.

Video Advertisement

మోనిత పాత్రలో నటించిన శోబిత శెట్టి కూడా ఈ సీరియల్ కు కలిసివచ్చిన అంశం. ఈ సీరియల్ రికార్డులు ఇప్పటి వరకు వేరే ఏ సీరియల్ కి లేవు. క్రికెట్ మ్యాచ్ ల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఈ సీరియల్ ముందు తేలిపోయాయి. ఈ సీరియల్స్ లో నటులకి ఉన్నంత క్రేజ్ సినిమా హీరోలకి కూడా లేదు. పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇక అయిపోతుందిలే.. అనుకునే టైమ్ కి కథను సాగదీశాడు దర్శకుడు. అలా ఏళ్లపాటు సీరియల్ హవా నడిచింది. ఇక చివరికి ఈ సీరియల్ కి ముగింపు పలికారు మేకర్స్. ఇక కార్తీక దీపం ప్లేస్ లో మరో కొత్త సీరియల్ రాబోతోంది.

trending memes on karthika deepam serial going off air

అయితే స్టార్ మా పరివారంలో సీరియల్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఈ సందర్భంగా లీడ్ రోల్ లో నటించిన ప్రేమి విశ్వనాథ్ కాస్త ఎమోషనల్ అయింది. నేను వెళ్లిపోతున్నానని ఎవరూ బాధపడకండి.. మళ్లీ వస్తానని చెప్పుకొచ్చింది. దానికి తగ్గట్టు సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ లో కూడా “మళ్ళీ కలుద్దాం..” అని వెయ్యడం తో అంతా అయోమయం లో పడిపోయారు. సీరియల్ ఇంకా అయిపోలేదా.. మళ్లీ వంటలక్క వస్తుందా అని మీమ్స్ మెుదలయ్యాయి. ఇక చాలు.. అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది వంటలక్కను మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. దీనిపై నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ పై ఓ లుక్కేయండి..

#1

memes on karthika deepam serial ending..
#2

memes on karthika deepam serial ending..
#3

memes on karthika deepam serial ending..
#4

memes on karthika deepam serial ending..
#5

memes on karthika deepam serial ending..
#6

memes on karthika deepam serial ending..
#7

memes on karthika deepam serial ending..
#8

memes on karthika deepam serial ending..
#9

memes on karthika deepam serial ending..
#10

memes on karthika deepam serial ending..
#11

memes on karthika deepam serial ending..
#12

memes on karthika deepam serial ending..
#13

memes on karthika deepam serial ending..
#14

memes on karthika deepam serial ending..

#16