“రాకీ భాయ్ మళ్లీ వస్తున్నాడు..!” అంటూ… “KGF చాప్టర్-3” అనౌన్స్మెంట్ పై 15 మీమ్స్..!

“రాకీ భాయ్ మళ్లీ వస్తున్నాడు..!” అంటూ… “KGF చాప్టర్-3” అనౌన్స్మెంట్ పై 15 మీమ్స్..!

by kavitha

Ads

కేజీఎఫ్ ఫ్యాన్స్ కు హోంబాలే ఫిల్మ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో త్వరలో ‘కేజీఎఫ్ 3’ రానుందని తాజాగా ఒక వీడియోతో హింట్ ఇచ్చారు.

Video Advertisement

గత సంవత్సరం ఇదే రోజు ‘కేజీఎఫ్ ఛాప్టర్ – 2’ రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన ఈ సీక్వెల్  వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుండి 3 వ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ‘కేజీఎఫ్ -3’ ఉంటుందని ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు.
కేజీఎఫ్ -2 విడుదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంబాలే ఫిల్మ్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. దీనిలో రాఖీ భాయ్ 1978-1981 మధ్య ఎక్కడ ఉన్నారనే విషయం పై ఆసక్తి కలిగించారు. రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట నెరవేరిందా అనే వాటిని ‘కేజీఎఫ్ -3’లో చూపించబోతున్నట్టు, హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేశారు. ఈ వీడియోతో’కేజీఎఫ్ -3′ పై అధికారిక ప్రకటన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
హోంబాలే ఫిల్మ్స్ నుంచి హింట్ రావడంతో ‘కేజీఎఫ్ – 3’ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ ఇచ్చిన ఒక  ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్ – 3’ ఉంటుందని,  త్వరలో దాని గురించి పని చేస్తామని తెలిపారు. ఈక్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై వీడియో ద్వారా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాతఎన్టీఆర్ తో ‘NTR31’ రాబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ‘కేజీఎఫ్ – 3’ ని ప్రారంభిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా, తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా కేజీఎఫ్ – 3 ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడంతో ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..

1. 2.3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.
Also Read: SHAAKUNTALAM REVIEW : “సమంత” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like