• చిత్రం : శాకుంతలం
 • నటీనటులు : సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ.
 • నిర్మాత : నీలిమ గుణ, దిల్ రాజు
 • దర్శకత్వం : గుణశేఖర్
 • సంగీతం : మణిశర్మ
 • విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023

shaakuntalam movie review

Video Advertisement

స్టోరీ : 

శకుంతల (సమంత) జననంతోనే సినిమా మొదలు అవుతుంది. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడు మేనక (మధుబాల) ని భూలోకంకి పంపిస్తాడు. ఆ తర్వాత మేనక ఒక అమ్మాయికి జన్మని ఇచ్చి, ఆ అమ్మాయిని భూలోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అడవిలో ఆ అమ్మాయిని చూసిన కన్వ మహర్షి శకుంతల అని పేరు పెడతారు. ఒక రోజు ఆయన ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుడు (దేవ్ మోహన్) శకుంతలని చూస్తాడు. వారిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు.

shaakuntalam movie review

అతను రాజు కాబట్టి ఆ మర్యాదలతో తన రాజ్యానికి ఆహ్వానిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు అయినా సరే దుష్యంతుడు మళ్ళీ తిరిగి రాడు. దీంతో శకుంతల దుష్యంతుడి కోసం వెళ్తుంది. అక్కడ శకుంతలని చూసిన దుష్యంతుడు తాను ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తాడు. శకుంతల భరత (అల్లు అర్హ) కి జన్మనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దుష్యంతుడు శకుంతలని ఎందుకు గుర్తుపట్టలేదు? శకుంతల ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీటన్నిటిని శకుంతల ఎలా అధిగమించింది? దుష్యంతుడికి ఏమయ్యింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు సమంత. సమంత ఎన్నో రకాల పాత్రలు చేశారు. కొన్ని యాక్షన్ ఉన్న పాత్రలు అయితే, మరికొన్ని సాధారణ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యే పాత్రలు చాలా ఉన్నాయి. కానీ మైథాలజీ సినిమా సమంత చేయలేదు.

shaakuntalam movie review

ఇప్పుడు ఈ సినిమాతో ఒక సోషియో ఫాంటసీ సినిమాలో సమంత నటించారు. అభిజ్ఞాన శాకుంతలం కథ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన కథనే సినిమా రూపంలో తనదైన స్టైల్ లో గుణశేఖర్ చూపించారు. గుణశేఖర్ సినిమాలు అంటే పెద్ద పెద్ద సెట్టింగులు ఉంటాయి. ఈ సినిమాలో కూడా చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి.

shaakuntalam movie review

కానీ అవన్నీ గ్రాఫిక్స్ అని తెలిసిపోతూ ఉంటాయి. ఏదో ఒకటి, రెండు చోట్ల అంటే అలా తెలిసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ అని, అసలు ఏది నిజమైనది కాదు అని ప్రేక్షకుడికి అర్థం అయిపోతుంది. శాకుంతలం ఒక ప్రేమ కథ. ప్రేమ కథలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత బాగుంటే ఆ ప్రేమ కథ అంత బాగా వస్తుంది. కానీ ఈ సినిమాలో అదే లేదు.

shaakuntalam movie review

అసలు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. డైలాగ్స్ బాగానే ఉన్నా కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలాగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒక్క చోట కూడా ప్రేక్షకులకి హై ఇచ్చే ఒక్క సీన్ కూడా ఉండదు. పాటలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. హీరోయిన్ కి సంబంధించిన సీన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏ ఒక్క సీన్ కూడా  ప్రేక్షకులని ఆశ్చర్యపరిచేలాగా అనిపించదు.

shaakuntalam movie review

ఫస్ట్ హాఫ్ అయిపోయే సమయానికి వచ్చే మోహన్ బాబు ఎంట్రీ మాత్రం మిగిలిన వాటితో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం తెరపై బాగా వచ్చిన సీన్స్ లో ఒకటిగా ఉంటుంది. పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి నటులు తమ పాత్రకి తగ్గట్టుగా చేశారు. కాకపోతే ఇప్పటి వరకు చిన్మయి వాయిస్ తో విన్నాం కాబట్టి, ఈ సినిమాకి, అందులోనూ కాస్త గ్రాంథిక భాష ఉన్న తెలుగులో సమంత డబ్బింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది.

shaakuntalam movie review

సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటీనటులు ఉన్నారు. వారందరూ తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. కానీ సినిమాలో ఉన్నది కొంచెం సేపు అయినా కూడా అల్లు అర్హ పాత్ర హైలైట్ గా నిలిచింది. అలాగే మోహన్ బాబు పాత్ర మరొక ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ సీన్స్ ఇంకా కొంచెం బాగా వచ్చేలాగా చూసుకొని ఉంటే బాగుండేది. వాళ్లు సీరియస్ గా యుద్ధం చేస్తున్నా కూడా ప్రేక్షకులకి కామెడీగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

 • పాటలు
 • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

 • తెలిసిన కథ
 • సాగదీసినట్టుగా ఉండే చాలా సీన్స్
 • హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ
 • నటీనటుల ఎంపిక

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

సినిమా నుంచి అస్సలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఈ మధ్య సోషియో ఫాంటసీ సినిమాలు చూసి చాలా రోజులు అయ్యింది కాబట్టి ఏదైనా అలాంటి సినిమా చూద్దాం అని అనుకొని ఈ సినిమా చూస్తే శాకుంతలం సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :