Ads
సినిమాల్లో ఎప్పటికప్పుడు బిజీగా ఉన్నప్పటికీ మహేష్ బాబు కుటుంబంతో ఉన్న కాస్త ఫ్రీ టైంను గడపడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట హిట్ తర్వాత బ్రేక్ తీసుకున్న మహేష్ తన ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన తీసుకున్న ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు నెట్లో వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా స్విమ్ సూట్ లో ఉన్న ఫోటో నెట్ లో ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఫోటో చూసిన ఎవరికైనా “మహేష్…..ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి” అన్న మూవీ డైలాగ్ తపకుండా గుర్తుకు వస్తుంది.
Video Advertisement
ఇప్పటివరకు ఏ మూవీలో మహేష్ బాబు షర్ట్ లేస్ గా కనిపించ లేదు. ఆయన కేవలం అతడు మూవీలో మొదటిసారి షాట్ లో కనిపించారు. అలాంటిది ఇప్పుడు ఎందరో కలల రాకుమారుడు అయిన సూపర్ స్టార్ షర్ట్ లేస్ గా కనిపించే సరికి అభిమానులు ఆ ఫోటోని నెట్లో వైరల్ చేశారు. తన పిల్లలతో పిల్లవాడిలా మారిపోయి మహేష్ బాబు సరదాగా స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలు నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు.
ఆ ఫోటో కింద” కొన్ని సాటర్డే మార్నింగ్ ఇలా ఉంటాయి….హ్యాష్‌ట్యాగ్ #toocoolforthepool” అని కామెంట్ చేశారు.ఈ ఫోటోలో కండలు తిరిగిన శరీరంతో మహేష్ బాబు కుర్ర కారు ను ఉర్రూతలూగించాడు. మహేష్ బాబు గడ్డంతో ఉన్న ఈ కొత్త ట్రెండీ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఈ ఫోటో చూస్తే మహేష్ కు ఎందుకు అంత ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉందో ఈసీ గా అర్థం అవుతుంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతోంది అని సమాచారం. ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.
#1
#2#3#4#5
Also Read : “ఈ మాత్రం దానికి అంత వెయిట్ చేయించడం ఎందుకో..?” అంటూ… SSMB28 సినిమా రిలీజ్ అప్‌డేట్‌పై 15 ట్రోల్స్..!
#6#7#8#9#10
Also Read : “మహేష్ బాబు ఎప్పుడూ కుర్రాడిలా ఎలా ఉంటారు..?” అనే ప్రశ్నకి… ఈ నెటిజన్ సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article