Ads
కథానాయకుడిగా మంచు మనోజ్ పంథా ఎప్పుడూ వైవిధ్యమే. ఒకేలాంటి సినిమాలకు పరిమితం కాకుండా ముందు నుంచి ప్రయోగాలు చేస్తూ రావడం ఆయనకు అలవాటు. గత కొంతకాలం గా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ కరోనా సమయం లో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తానని గతంలోనే ఒక ట్వీట్ చేశారు మనోజ్. కానీ దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. కానీ తన తదుపరి సినిమా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు మనోజ్.
Video Advertisement
త్వరలోనే స్పెషల్ న్యూస్ ఒకటి చెప్తా అంటూ మంచు మనోజ్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే మనోజ్ నయా ప్రాజెక్ట్ ‘వాట్ ది ఫిష్’. ఈ సినిమా పోస్టర్ రివీల్ చేస్తూ..” నేను ఇన్ని రోజులు సినిమాలు చేయకపోయినా మీరు నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఆ ప్రేమను మీకు తిరిగిచ్చే సమయం వచ్చింది.. వాట్ ది ఫిష్ అనేది నా కొత్త సినిమా.. ఇదొక క్రేజీ సినిమా.. మీకు క్రేజీ అనుభూతిని ఇస్తుంది.” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేసాడు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లాంఛ్ చేసి తన ఫాలోవర్లకు గుడ్‌న్యూస్ చెప్పాడు.
డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన భారతీయ కంటెంట్‌తో అందరి మనస్సును కదిలించే మా హృదయపూర్వక ప్రయత్నమే ఈ సినిమా అంటూ డైరెక్టర్ వరుణ్ చెప్పుకొచ్చాడు. సుమారు ఆరేళ్ళ విరామం తర్వాత మనోజ్ నటిస్తున్న చిత్రమిది. కాన్సెప్ట్ పోస్టర్ లో చూస్తుంటే ఓ అమ్మాయి గూగుల్ మాస్క్ పెట్టుకున్న క్యారికేచర్ పోస్టర్ టాప్ లో కనబడుతోంది. హీరో వెనుక నుంచి తీసిన ఫోటో చూపించారు. బాగా గడ్డాలు పెంచుకుని కార్ల మీద వస్తున్న విలన్లు, ముందు వింటేజ్ కార్ చూస్తే… స్టైలిష్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది.
ఇటీవల సినిమా వార్తలతో కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మంచు మనోజ్ నలుగురు నోళ్ళలో పడ్డారు. అందువల్ల, ఆయన స్పెషల్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే… చాలా మంది పెళ్ళి గురించి క్లారిటీ ఇస్తారని భావించారు. కానీ తన కొత్త చిత్రం ప్రకటించి ఫాన్స్ ని ఖుషి చేసాడు మనోజ్. అయితే మనోజ్ కరోనా సమయంలో ప్రకటించిన అహం బ్రహ్మస్మి సినిమా పనులు కూడా బాగానే జరిగాయి. రామ జోగయ్య శాస్త్రితో పాటలు కూడా రాయించాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ కారణాలతో అటకెక్కేసినట్టు తెలుస్తోంది. ఇక మంచు మనోజ్ సైతం తన పర్సనల్ సమస్యలతో సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు.
అయితే మనోజ్ కొత్త ప్రాజెక్ట్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article