“ఇదేదో హిట్ అయ్యేలాగే ఉంది కదా..? అంటూ… నాగ చైతన్య “కస్టడీ” ట్రైలర్‌పై 10 మీమ్స్..!

“ఇదేదో హిట్ అయ్యేలాగే ఉంది కదా..? అంటూ… నాగ చైతన్య “కస్టడీ” ట్రైలర్‌పై 10 మీమ్స్..!

by Anudeep

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య కమర్షియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు అనుకునే లోపు థాంక్యూ ద్వారా మరో ఫ్లాప్‌ మూటగట్టుకున్నాడు.

Video Advertisement

దీంతో కస్టడీ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు చై. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, టీజర్‌ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమాలో నాగచైతన్య శివ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనున్నాడు.

memes on custody movie trailer..!!

ఈ సినిమా మే 12న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర బృందం.. రీసెంట్గా ప్రమోషన్స్ లో భాగంగా “కస్టడీ” సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది.

memes on custody movie trailer..!!

ఇక ఈ ట్రైలర్‌ యాక్షన్‌, థ్రిల్‌, లవ్‌ ఇలా షడ్‌ రుచుల సమ్మేళనంగా ట్రైలర్‌ కనిపిస్తుంది. నాగచైతన్య లుక్‌ కూడా కొత్తగా, చాలా నేచురల్‌గా కనిపించింది. ఇక చాలా కాలం తర్వాత కృతికి మంచి పాత్ర పడ్డట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి .. ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. అలాగే కీలక పాత్రల్లో శరత్ కమార్, అరవింద్ స్వామి నటించారు.

memes on custody movie trailer..!!
ఈ చిత్రానికి ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. నాగ చైతన్య డైలాగ్స్​కు ఈ మ్యూజికే ప్రాణం పోసిందని చెప్పాలి. స్క్రీన్​పై కనిపించే ప్రతి సన్నివేశాన్ని.. ఈ మ్యూజికే హైలైట్​ చేసింది. ఆడియెన్స్​లో గూస్​బంప్స్​ తెప్పించింది. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా నేపథ్య సంగీతం ట్రైలర్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుంది అని అర్థం అవుతుంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on custody movie trailer..!!
#2

memes on custody movie trailer..!!
#3

memes on custody movie trailer..!!
#4

memes on custody movie trailer..!!
#5

memes on custody movie trailer..!!
#6

memes on custody movie trailer..!!
#7

memes on custody movie trailer..!! #8

#9#10#11#12

watch video :


You may also like