టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ 30’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో ‘జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Video Advertisement

ఈ భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా… బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌, బ‌య‌ట‌కు వ‌చ్చిన స్టిల్స్ ఆక‌ట్టుకున్నాయి. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ రోజు రాత్రి 7.02 గంట‌ల‌కు ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ గ్రాండ్‌గా రిలీజ్ చేసారు.

memes on NTR 30 first look poster..!!

ఫస్ట్ లుక్ పోస్టర్ కు సబంధించిన అనౌన్స్ మెంట్ ను కూడా ఓ పోస్టర్ తో రిలీజ్ చేశారు టీమ్. సముద్రం ఒడ్డున వరుసగా కత్తులు గుచ్చుకుని ఉన్నపోస్టర్ తో పాటు.. సముద్రం అంతా ఆయన రక్తం నిండి ఉంది అన్న కొటేషన్ తో పోస్టర్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు మూవీ టీమ్. దీంతో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

memes on NTR 30 first look poster..!!

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు కొర‌టాల‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన మిక్కిలినేని సుధాక‌ర్ ఈ సినిమాకు నిర్మాతలు. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ సినిమా కి మ్యూజిక్ ఇస్తున్నారు. అలానే ఎన్టీఆర్ 30కి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు.

memes on NTR 30 first look poster..!!

ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, వీడియోస్ ని బట్టి ఈ చిత్రం సముద్రం, పోర్ట్, స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అని తెలుస్తోంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక NTR30 తర్వాత తారక్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నాడు.

memes on NTR 30 first look poster..!!

ఇక తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1


#2


#3


#4


#5


#6


#7


#8


#9


#10


#11


#12


#13


#14


#15


#16


#17


#18