Ads
ప్రస్తుతం ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు, ప్రత్యేక రోజుల సందర్భంగా వారి వారి సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆలా ఇప్పటి వరకు జల్సా, ఖుషి, వర్షం, పోకిరి వంటి చిత్రాలు రిలీజ్ అయ్యి, అభిమానులను అలరించాయి. అయితే మహేష్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అయిన ‘ఒక్కడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యాలని అభిమానులు గత కొంత కాలం గా కోరుతున్నారు.
Video Advertisement
2003లో రిలీజైన ఒక్కడు మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటనకి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రకాశ్ రాజ్ విలనిజం.. మహేష్ బాబు మేనరిజం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. అప్పట్లో రూ. కోట్ల వర్షం కురిపించిన ఒక్కడు మూవీని అభిమానుల కోసం రీ రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 7న ‘ఒక్కడు’ మూవీని అభిమానుల కోసం రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతికి థియేటర్లు బిజీ అయిపోనున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా చేసిన వీరసింహా రెడ్డి, తమిళ్ హీరోలు విజయ్ ‘వారుసుడు’, అజిత్ ‘తెగింపు’, యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాలు వరుసగా జనవరి 11 నుంచి రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఇక ఒక వారం మాత్రమే థియేటర్లు కాస్త ఫ్రీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కడు మూవీని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఇటీవల రీరిలీజ్ చేయగా.. ఖుషీ మూవీ రూ.కోట్లలో వసూళ్లని రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ సినిమాల్నికూడా రీ రీలిజ్ చేశారు. మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమాని కూడా రీ రిలీజ్ చేసారు. పోకిరి సినిమా స్పెషల్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. నైజాంలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4లక్షలు వసూల్ అయ్యాయి. అయితే ఒక్కడు రీ రిలీజ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article