Ads
భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా?..వెళ్లి గెలుస్తుందా..? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు… సినిమాలోని ‘నాటు నాటు…’ ఆస్కార్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది.
Video Advertisement
మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ‘నాటు నాటు…’ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా… ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా… రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకున్నాయి.
ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో అంతర్జాతీయ పురస్కారాలు సైతం అందుకుంది ఆర్‌ఆర్‌ఆర్. RRR సినిమాలో చరణ్ ని అల్లూరి సీతా రామరాజు గాను, ఎన్. టి.ఆర్ ని కొమరం భీం గాను చూపిస్తూ జక్కన్న తన మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లతో భారతీయ సినీ ప్రేక్షకుల్ని కట్టి పడేసాడు. అత్యద్భుతమైన కధ, కథనాల తో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని అలరించింది.
చరణ్ ని అయితే భారతీయ సినీ అభిమానులు శ్రీరాముడి గా అభివర్ణిస్తూ కీర్తించడం జరిగింది. ఇంటర్వల్ ముందు తారక్ ఎంట్రీ, కొమరం భీముడొ సాంగ్ లో భావోద్వేగాలు పలికించిన తీరు కి, తారక్ కి కూడా ఈ సినిమా తో దేశ వ్యాప్తం గా అభిమానులు ఏర్పడ్డారు.ఈ సినిమా తో చరణ్, తారక్ లని జక్కన్న పాన్ ఇండియా హీరోలు గా మారారు.
ఈ మూవీ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లని చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా కూడా ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకి ఒక హైలైట్ అయ్యింది.
అలాగే క్లైమాక్స్ లో వచ్చే షోల్డర్ ఫైట్ కూడా ఒక ప్లస్ పాయింట్. అల్లూరి సీతారామరాజును బ్రిటీష్ ప్రభుత్వం బంధిస్తే ఆ చెర నుంచి చరణ్ ను తారక్ కాపాడి తీసుకువెళ్ళటప్పుడు వచ్చే షోల్డర్ ఫైట్ సినిమా కు వన్ ఆఫ్ ది హైలైట్. ఈ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు హీరోలు. రామ్‌చరణ్‌ను భుజాల పైన కూర్చోబెట్టుకుని ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ ను కంపోజ్ చేసింది ప్రేమ్ రక్షిత్ మాస్టర్.
ఇక ఈ అద్భుత దృశ్యకావ్యం విడుదలై సంవత్సరం కావడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article