Ads
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కోలీవుడ్ లో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమా రీమేక్‍గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.
Video Advertisement
ఈ చిత్రం వచ్చే నెల జూలై 28 థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. నిన్న పవన్ కల్యాణ్ ఈ టీజర్‌కు డబ్బింగ్ చెప్పటంతో సిద్ధం అయింది. మేకర్స్ ముందుగానే బ్రో మూవీ టీజర్, రిలీజ్ డేట్, టైమ్‍ను ప్రకటించింది. ఇక ఈ టీజర్ పై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి బ్రో సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తుండగా, పవన్ కల్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. తేజ్ పక్కన హీరోయిన్లుగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా, దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ను రాశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బ్రో సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ తో ప్రమోషన్లను ప్రారంభించాలని భావిస్తోంది. జూలై మూడవ వారంలో బ్రో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతూ కూడా బ్రో టీజర్ కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పే టైంలో టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బ్రో టీజర్ రిలీజ్ అవడంతో దీనిపై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18
watch video :
Also Read: తమ భర్తతో/ప్రేమించిన వ్యక్తితో విడిపోయాక… “నెగిటివ్ కామెంట్స్” ఎదుర్కొన్న 7 హీరోయిన్స్..!
End of Article