Ads
పవన్ కళ్యాణ్ లైనప్‌లో ‘వినోదయ సిత్తం’ రీమేక్ ఒకటి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో కోట్ల ప్రశంసలు దక్కించుకున్న ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది.
Video Advertisement
తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ కథలో పలు మార్పులు చేర్పులు చేశాడు. ఇప్పటికే సెట్స్ నుంచి లీకైన ఫోటోలు నెట్టింట దుమారం రేపాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మనిషి రూపంలో ఉన్న దేవుడిగా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది.
ఈ సినిమాకు ‘బ్రో:ది అవతార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో పవన్ స్టయిలిష్ లుక్‌లో మంచి ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా చాలా కాలం తర్వాత పాత పవన్ కళ్యాణ్‌ను చూసినట్టు అనిపిస్తుంది. స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ ఇలా మూడు కలబోసినట్లుగా పవన్ కళ్యాణ్ పోస్టర్ ఉంది.
కొన్ని రోజుల క్రితమే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ రోజు అధికారికంగా ఆ టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా మోషన్ పోస్టర్ కోసం సంగీత సంచలనం తమన్ అందించిన నేపథ్య సంగీతం అలరించింది.
తెలుగులో మాస్ మహారాజా రవితేజ ‘శంభో శివ శంభో’, నాని ‘జెండా పై కపిరాజు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖని ‘బ్రో’ మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ట్రెండింగ్ అవుతుంది. అయితే ఈ పోస్టర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article