Ads
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.
Video Advertisement
తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేడు (మే 15) రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని విడుదల చేసి అభిమానులకు ఫుల్ జోష్ తెచ్చారు మేకర్స్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీలీల నటిస్తుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈ ఫస్ట్ థండర్ లో రామ్ మామూలు మాస్ లుక్కులో లేరు. ఫస్ట్ లుక్ పోస్టల్లో చూపించినట్లుగానే రామ్ లుక్ ఊరమాస్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా కోసం రామ్ కొంచెం లావు అయ్యినట్లు కనిపిస్తుంది. గ్లింప్స్ మొత్తాన్ని యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసాడు బోయపాటి.
ఈ గ్లింప్స్ లో రామ్ చెప్పిన మాస్ డైలాగ్.. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అదిరిపోయింది. విలన్స్ ను చితకబాదే విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫస్ట్ గ్లింప్స్ వెనుక మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఫస్ట్ థండర్ విడుదల చేశారు.
ఇక ఈ మూవీ లో బుల్ ఫైటింగ్ సీన్ కూడా ఉందని తెలుస్తోంది. సుమారు పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్. ఇది కాకుండా 1500 మందితో మరో ఫైట్ తీశారట. అలాగే ఈ మూవీ లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.
ఇక తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article