Ads
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గతేడాది చివర్లో ‘ధమాకా’ అంటూ బాక్సాఫీస్ దగ్గర పటాసులు పేల్చిన రవన్న.. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అదే జోష్‌తో ‘రావణాసుర’ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేశాయి.
Video Advertisement
ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా రూపొందించారు. ఈ చిత్రం కోసం రవితేజ తొలిసారి క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించారు. అందు కోసం రవితేజ కొంత మంది లాయర్స్‌ను కలిసి వారి బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకుని మరీ నటించారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటించారు. అలాగే అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్స్‌గా నటించారు.
ఇక తాజాగా రిలీజ్ అయినా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. క్రైమ్, మిస్టరీ, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, షాకింగ్ స్క్రీన్ ప్లే లాంటి అంశాలతో రూపొందిన చిత్రం రావణాసుర. రవితేజ తన రెగ్యులర్ ఇమేజ్, స్టైయిల్‌ను పక్కన పెట్టి.. సరికొత్తగా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాకు పాజిటివ్ పాయింట్ గా మారాయి.
అయితే సెన్సార్ రివ్యూ కూడా రావణాసుర మేకర్స్ కి గట్టి షాక్ ఇచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తారని మూవీ టీం ఆశించింది. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ మూవీ కి A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అలాగే A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు మల్టిప్లెక్స్ లలో 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎంట్రీ లేదన్న విషయం తెలిసిందే. కానీ సినిమా పై నమ్మకం తో మేకర్స్ ముందడుగు వేశారు.
ఇక ఈ మూవీ రిలీజ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article