Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.
సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై కనిపించరు. కేవలం వారు పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత మరిన్ని పెద్ద హీరోల మల్టీస్టారర్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ తమ పాత్రలకి ప్రాణం పోశారు. రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ కి అంత మంచి పాత్ర లభించింది. సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటులు ఉన్నారు. కానీ ఎవరికీ అంత పెద్ద ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించలేదు. హీరోయిన్ గా నటించిన అలియా భట్ కూడా కొంచెం సేపు కనిపించి వెళ్ళిపోతారు. సినిమా విడుదల అయినప్పుడే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article