భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు… సినిమాలోని ‘నాటు నాటు…’ ఆస్కార్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది.

Video Advertisement

ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ సినిమా పాటగా ‘నాటు నాటు…’ చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ‘నాటు నాటు…’ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా… ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా… రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకున్నాయి.

memes on RRR win oscar for 'natu natu' song..

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా ‘నాటు నాటు…’ పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పారు. అలాగే ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని.. రెండుసార్లు సినిమా చూశానని తెలిపారు. అయితే ఆస్కార్ కంటే ముందు ‘నాటు నాటు…’ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చింది. ఈ అవార్డు ద్వారా దేశానికి రాజమౌళి గొప్ప గౌరవం తెచ్చారు.

‘నాటు నాటు…’కు ఆస్కార్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు రావడం తో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.

ఎస్‌ఎస్‌ రాజమౌళి ‌దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో పురస్కారాలు సైతం అందుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌. మరో వైపు ఈ విజయం సాధించడం పై పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీం కి అభినందనలు కురిపిస్తున్నారు. మరోవైపు నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on RRR win oscar for 'natu natu' song..
#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20