దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. నలుగురు నడిచిన బాట నడిచే దర్శకుడు కారు. తన ఆలోచన తనదే. కళ్ల ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. చివరిగా ఆయన చారిత్రక నేపథ్యం లో వచ్చిన రుద్రమదేవి చిత్రం చేసారు. అయితే ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చెయ్యలేదు గుణశేఖర్. అయితే చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తో ‘శాకుంతలం’ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Video Advertisement

 

ఈ చిత్రం పురాణాల ఆధారం గా రానుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్‌ మోహన్‌ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటిస్తోంది.

trending memes on samantha shakuntalam trailer

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం .. మరో వైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం .. ప్రేమ .. వివాహం .. విరహం .. దుర్వాసుడి శాపం .. భరతుడి జననం వరకూ ఈ ట్రైలర్ లో చూపించేశారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇది అందరికి తెలిసిన కథే కావడంతో ట్రైలర్ లోనే కథ చూపించేశారు. ఇక ట్రైలర్ చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ గ్రాండ్ గా చూపించారు.

 

ఇక విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయి. ట్రైలర్ లోనే బాహుబలికి మించి విజువల్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో మోహన్ బాబు,ప్రకాశ్ రాజ్, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చాలా నెలల తర్వాత సమంత మీడియా ముందుకి వచ్చింది. అయితే ఈ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి..వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on shakunthalam movie trailer..!!
#2

memes on shakunthalam movie trailer..!!
#3

memes on shakunthalam movie trailer..!!
#4

memes on shakunthalam movie trailer..!!
#5

memes on shakunthalam movie trailer..!!
#6

memes on shakunthalam movie trailer..!!
#7

memes on shakunthalam movie trailer..!!
#8

memes on shakunthalam movie trailer..!!
#9

memes on shakunthalam movie trailer..!!
#10

memes on shakunthalam movie trailer..!!
#11

memes on shakunthalam movie trailer..!!
#12

memes on shakunthalam movie trailer..!!
#13

memes on shakunthalam movie trailer..!!
#14

memes on shakunthalam movie trailer..!!
#15

memes on shakunthalam movie trailer..!!
#16

memes on shakunthalam movie trailer..!!
#17

memes on shakunthalam movie trailer..!!
#18

memes on shakunthalam movie trailer..!!

watch video :