Ads
తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేసారు. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో వస్తే.. తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రం తో ధనుష్ హిట్ కొట్టాడు. సంయుక్త హీరోయిన్ గా నటించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సాయి కుమార్, సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, సుమంత్ కీలక పాత్రలు పోషించారు.
Video Advertisement
అయితే తమిళ సినిమా హీరోలకు తెలుగులో రోజు రోజుకు మార్కెట్ పెరుగుతోంది. అటు తమిళ నాట కూడా మంద దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్నాయి. అయితే వీటికి తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ దక్కుతోంది. అవ్వడానికి తమిళ్ హీరోలైనా సినిమాకు రికార్డు స్థాయి ఓపినింగ్స్ మాత్రం మన దగ్గరే జరుగుతోంది.
విడుదలకు ముందే ప్రీమియర్స్ షోలతో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. ఇక తాజాగా ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలను నిలదీస్తూ.. విద్యావిలువను చెప్పిన ఈ సినిమాకు ప్రేక్షకుల హిట్ టాక్ అందించారు. ఇక ఈ సినిమా కూడా తెలుగులో భారీ ఒపింగ్స్ అందుకుంది. తమిళ్ కంటే తెలుగులోనే ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఇక తొలి రోజే సూపర్ హిట్ అందుకున్న సార్ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
అయితే సార్ చిత్రం హిట్ కావడం పై నెట్టింట మీమ్స్ వైరల్ గా మారాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
End of Article