Ads
త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఇంతకు ముందే అతడు, ఖలేజా వచ్చాయి. అయితే వీరిద్దరు కలిసి మరో సినిమా తీస్తున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు. త్రివిక్రమ్ సూపర్ స్టార్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా వస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి అటు గురూజీ ఫ్యాన్స్, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వస్తున్నారు.
Video Advertisement
దీని గురించి త్రివిక్రమ్, మహేష్ ని కలిసి అనేకసార్లు చర్చలు జరిపాడు. మొదట షూటింగ్ జూన్ లో అనుకున్నారు కానీ వాయిదా పడింది. ఆ తర్వాత జులై రెండవ వారం అని వార్తలు వచ్చాయి కానీ దీనిపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆగస్ట్ లో షూటింగ్ ప్రారంభించి 2023 సమ్మర్ లో చిత్రం విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ కాగా తమన్ సంగీతం అందించనున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా షెడ్యూల్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు ఇంకో సంవత్సరం పడుతుంది అని కొందరంటే.. మొత్తానికి ప్రారంభిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు.. త్రివిక్రమ్ తో సినిమా సంవత్సరం అంటే.. రాజమౌళితో ఐదు సంవత్సరాలు పడుతుంది అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్ పై అనేక మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం . .
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
End of Article