Ads
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు తనకు కలిసొచ్చిన అదే జోనర్ లో సంక్రాంతి బరిలో నిలిచారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా శృతి హాసన్ నటించింది. అలానే విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్ నటించాడు.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇన్ సైడ్ రిపోర్ట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీరసింహారెడ్డి ఇన్ సైడ్ రిపోర్ట్ కూడా చాలా బాగుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ చిత్రం అని అంటున్నారు.
తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేసారు. అన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రం లో రామజోగయ్య శాస్త్రి అన్ని పాటలను రాసారు. అలాగే జనవరి 12వ తేదీ ఉదయం 4 గంటల ఆటకు వీరసింహారెడ్డి చిత్ర ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభ్యర్థనపై మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అఖండ, క్రాక్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని చేయనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. తన కెరిర్‌లో మొదటిసారిగా బాలయ్యతో సినిమా చేస్తున్న గోపీచంద్ మలినేని.. అసలు బాలయ్యను ఏ స్థాయిలో చూపించాడు.. ఏ రేంజ్ లో ఆయనతో యాక్షన్ చేయించాడు అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరసింహ రెడ్డి రిలీజ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15
#16#17#18
End of Article