Ads
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ఈ సినిమా ద్వారా కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమయ్యారు. సంయుక్త మీనన్ కథానాయిక. బాపినీడు. బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Video Advertisement
‘రిపబ్లిక్’ లాంటి సోషల్, పొలిటికల్ డ్రామా తరవాత సాయితేజ్ చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. అలాగే సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైన తరవాత నటించిన సినిమా కావడంతో ‘విరూపాక్ష’పై అందరికీ ఆసక్తి ఏర్పడింది. సుమారు రెండేళ్ల విరామం తరవాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్లోనే ఇది హారర్ కథాంశమని అర్ధమయ్యింది. ఇంత వరకు సాయితేజ్ ఈ తరహా చిత్రం చెయ్యకపోవడం, ఈ జానర్లో పెద్ద హీరో సినిమా చూసి కూడా చాలా కాలం కావడం తో అందరికి దీనిపై ఆసక్తి నెలకొంది.
‘విరూపాక్ష’ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ బిజినెస్ రూ. 23 కోట్లు వరకూ జరిగింది. ఇది సాయి తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. అయితే, బిజినెస్ ఎక్కువే జరిగినా థియేటర్ల సంఖ్య తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు.
ఇక తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దర్శకుడు కార్తీక్ దండు ఎలాంటి డివియషన్ లేకుండా కథను ఫర్ఫెక్ట్ ప్రజెంట్ చేశారు. అక్కడక్కడ కాస్త స్లోగా సాగినప్పటికీ అది పెద్ద మైనస్ మాత్రం కాదు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ చక్కగా నటించారు. సాయి తేజ్ నటనలో పరిణతి కనిపించింది.
ఇక పోతే ఈ చిత్రానికి ప్రస్తుతం పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ రివ్యూ లు చేతే సాయి తేజ్ కి హిట్ పడినట్టే అంటున్నారు మెగా అభిమానులు. అయితే ఈ మూవీ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article