Ads
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పుష్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో పుష్ప టీం ఒక టీజర్ ని రిలీజ్ చేసింది. పుష్ప మొదటి భాగం పూర్తయిన తర్వాత అక్కడనుండి పుష్ప యొక్క జీవితం ఎలా మారిపోయింది అనేదానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశాడు డైరెక్టర్ సుకుమార్.
Video Advertisement
పాన్ ఇండియా రేంజ్ సినీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తాజా చిత్రాల లిస్టులో పుష్ప 2 ముందు వరులో ఉంది. దానికి తగ్గట్టే పుష్ప సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ 3 నిమిషాల 18 సెకన్ల వీడియో ని రిలీజ్ చేసారు మేకర్స్.
ఆ వీడియో లో తిరుపతి పోలీసులు అతని మీద కాల్పులు జరిగిన తర్వాత అక్కడ నుండి మాయమైన అతను ఏమైపోయాడు అనేది ఎవరికి తెలియదు. నెలలు తరబడి కనబడకుండా పోయిన పుష్ప ఎక్కడికి వెళ్లాడని పోలీసులు అందరూ వెతుకుతూ ఎన్నో నెలలు గడిపేస్తుంటారు. పుష్పకు ఏమైంది అని తెలుసుకునే పనిలో ఎన్నో ఊళ్లో తగలబడిపోయి జనాలు అందరూ గొడవలు పడుతూ కనిపిస్తుంటారు.
ఈ గొడవలు అన్నిటిని ఆపలేక పోలీస్ ఫోర్స్ దిగిన కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే టీజర్ లో చూపించిన విధంగా నల్లమల అడవుల్లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన కెమెరాలు పుష్ప నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం క్యాప్చర్ అవ్వగా, అతను నల్లమల అడవుల్లో దాక్కుని ఉన్నాడన్న విషయంపై పోలీసులకు క్లారిటీ వస్తుంది. ఇక ఆ వీడియో చూసి తిరుపతిలో పుష్పను ఇష్టపడే వారందరూ తను బతికే ఉండాడని సంబరాలు చేసుకోవడం కనిపిస్తోంది.
అలా టీజర్ మొత్తం పుష్పరాజు ఎక్కడున్నాడు అనే విషయం పైనే నడుస్తూ ఉంటుంది. అడవిలో ఉన్న పులి రెండడుగులు వెనక్కి వేసింది అంటే అక్కడ పుష్ప రాజ్ ఉన్నాడని అర్థం అంటూ టీజర్ లాస్ట్ లో అద్భుతమైన డైలాగ్ ని పెట్టి రిలీజ్ చేసారు. ఇక ఆ లాస్ట్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. అసలు స్మగ్లింగ్ చేసే పుష్ప ఎన్నిమంచి పనులు చేస్తున్నాడనే విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. అలాగే మరోసారి బన్నీ తగ్గేదే లే మేనరిజమ్ పీక్స్ లో ఉంది.
ఇక ఈ వీడియో పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article