నిమ్మకాయల ధర కేజీ 300 రూ.లు దాటడంపై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్..!

నిమ్మకాయల ధర కేజీ 300 రూ.లు దాటడంపై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్..!

by Anudeep

Ads

దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో ఒక్క నిమ్మకాయ రూ.10-15 వరకు విక్రయిస్తున్నారు. గత కొన్ని వారాలుగా, నిమ్మకాయ ధర అనూహ్యంగా గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలో నిమ్మకాయను పండించిన లెక్కలను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఉత్పత్తి తగ్గిన పక్షంలో డిమాండ్ పెరిగి ధర కూడా ఎక్కువ అవుతుంది. చాలా మార్కెట్‌లలో ఒక్క నిమ్మకాయ రూ.10 నుండి రూ.15 మధ్యలో ఉంది.

Video Advertisement

దేశవ్యాప్తంగా పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్ వంటి కూరగాయల ధరలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఎప్పుడు లేనిది ఒక్కసారిగా నిమ్మకాయల ధర పెరగడంతో సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి.

trolls on lemon price hike

ఢిల్లీలో, వేసవిలో అవసరమైన సిట్రస్ పండ్ల ధర కిలోకు రూ. 300 నుండి రూ. 350 వరకు ఉంటుంది, అంటే ఒక్క కాయ కూడా రూ. 10 కంటే ఎక్కువ. అదేవిధంగా గుజరాత్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.300 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక కూరగాయల విక్రేత మాట్లాడుతూ తాను మొత్తం నిమ్మకాయ బస్తాను రూ.700కు కొనుగోలు చేసేవాడినని, అయితే ఇప్పుడు దాని ధర రూ.3,500 అని చెప్పాడు.

#1.

trolls on lemon price hike

#2.

trolls on lemon price hike

#3. trolls on lemon price hike

నిమ్మకాయల ఉత్పత్తికి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఆ ప్రభావం పంటలపైనా పడింది. సాధారణంగా వేసవి కాలంలోనే నిమ్మకాయల అవసరం ఎక్కువ ఉంటుంది. ఎండ మండిపోతుంటే.. చల్లగా నిమ్మకాయ సోడా, లేక నింబు పానీని తాగినా తక్షణమే రిలీఫ్ వస్తుంది.

#4.

trolls on lemon price hike

#5. trolls on lemon price hike

అయితే ఉష్ణోగ్రతల ప్రభావం పంటపై పడడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ మరియు CNG ధరల పెరుగుదల ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దీనితో నిమ్మకాయల ధర కూడా పెరిగిపోయింది. నిమ్మకాయల ధర పెరగడంతో ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#6.

trolls on lemon price hike

#7. trolls on lemon price hike


End of Article

You may also like