Ads
రామ్ పోతినేని ‘వారియర్’ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. అందులో ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.
Video Advertisement
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమాను 20 అక్టోబర్ 2023న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది టీమ్. అఖండ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో రామ్ కు జోడిగా నటిస్తోంది. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అని తెలుస్తోంది. దీంతో ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసం హిందీ నటుడు, ఒకప్పటి స్టార్ హీరోను తీసుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రముఖ హిందీ హీరో అనిల్ కపూర్, రామ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాను బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఈ నెల 15న ఫస్ట్ థండర్‌ను అంటే ఓ వీడియోను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.రామ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 15న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి ఆ వీడియో రిలీజ్ ఉండనుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్లో రామ్ ఊహించని మాస్ అవతార్‌లో అదరగొట్టాడు.
అయితే ఈ పోస్టర్ లోని రామ్ లుక్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article