Ads
మహాకవి కాళిదాసు రచనల్లో ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఇంతటి గొప్ప కావ్యాన్ని మన ముందుకి తీసుకొచ్చారు దర్శకుడు గుణశేఖర్. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు.
Video Advertisement
సమంత తన కెరీర్ లో తొలి సారిగా పౌరాణిక పాత్రని చేసింది. పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదు. కొంత మంది సినిమా బాగుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది అంటే, మరి కొంత మంది మాత్రం, చాలా ఆశలు పెట్టుకొని వెళ్ళాము. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది అంటున్నారు.
శకుంతలను కాళిదాసు శృంగార నాయికిగా అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించారు. సమంతను ఆ విధంగా చూపించడంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యారు. నటీనటుల ఎంపికలోనూ కాస్త తడబాటు కనిపించింది. ఈ సినిమా ముఖ్యం గా ప్రేమపైనే నడుస్తుంది. కానీ ఈ మూవీ లో ఆ మేజిక్ మిస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో సాగదీత, గ్రాఫిక్స్ వర్క్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. పతాక సన్నివేశాల్లో అర్హ నటన అందరికీ నచ్చుతుంది.
ఇక సమంత మంచి నటి అన్న విషయం మనకి తెలిసిందే. కానీ శకుంతల పాత్రకు సమంత సూటవ్వలేదని అనిపిస్తుంది. సొంత డబ్బింగ్గూ మైనస్సే. ప్రేమకథ కంటే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నటిగా అనుభవం చూపించారు సామ్. దేవ్ మోహన్ రూపం బావుంది కానీ నటన బాలేదు. మధుబాల, గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖేడేకర్ సహా చాలా మంది తారాగణం తెరపై కనిపించారు. ఎవరూ గుర్తుంచుకునేంత రీతిలో నటన కనబరచలేదు.
ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఆశించిన ఫలితం రాకపోవడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article