TRIPTI DIMRI ABOUT ANIMAL: యానిమల్ సినిమా చూసి అమ్మానాన్న ఫీలయ్యారు… నటి కామెంట్స్ వైరల్…?

TRIPTI DIMRI ABOUT ANIMAL: యానిమల్ సినిమా చూసి అమ్మానాన్న ఫీలయ్యారు… నటి కామెంట్స్ వైరల్…?

by Harika

Ads

రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ సూపర్ డూపర్ హిట్ అయింది. రణబీర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా యానిమల్ నిలిచింది. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉందని బయట చెబుతున్న కూడా ఆడియన్స్ అవి పట్టించుకోకుండా సినిమాకి చూపెడుతున్నారు. చాలామంది సినీ విమర్శికులు సినీ జనం సైతం యానిమల్ సినిమాని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Video Advertisement

అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కన్నా కూడా జోయపాత్రుడు నటించిన త్రిప్తి దిమ్నీకి ఎక్కువ పేరు వచ్చింది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన పది నిమిషాలు అయినా కూడా తన నటనకి ఆడియన్స్ అందరూ ముద్దులు అయిపోయారు. రణబీర్ తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో త్రిప్తి రెచ్చిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో త్రిప్తికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు కూడా క్యూ కట్టాయి.

అయితే ఈ యానిమల్ సినిమా పైన త్రిప్తి స్పందిస్తూ ఈ సినిమా చూసి తన తల్లిదండ్రులు ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చింది. మేము ఎప్పుడూ ఇలాంటివి సినిమాల్లో చూడలేదు.. ఇలాంటి సన్నివేశాలు నటించావు ఏంటి అంటూ త్రిప్తి తల్లిదండ్రులు అన్నారట. అయితే వారికి తాను ఒక నటిగా మాత్రమే ఇలా చేశాను అని చెప్పి వాళ్లను కన్విన్స్ చేసేందుకు కొద్దిగా టైం పట్టిందట. తాను ఎటువంటి తప్పు చేయలేదని కేవలం నటిగా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశానని చెప్పింది.


End of Article

You may also like