అప్పుడు గురూజీ కరెక్ట్ గానే చెప్పారు.. మనకే అర్ధం అవ్వలేదు..! ఈ వీడియో చూసారా..?

అప్పుడు గురూజీ కరెక్ట్ గానే చెప్పారు.. మనకే అర్ధం అవ్వలేదు..! ఈ వీడియో చూసారా..?

by kavitha

Ads

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకు ముందు అతడు, ఖలేజా సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. ఈ చిత్రం పై ఇప్పటికే ఆడియెన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.

Video Advertisement

ఇప్పటికే ఈ మూవీ సగం షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ సినిమా నుండి హీరోయిన్ పూజహెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టుగా వార్తలు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ మీనాక్షి గురించి మాట్లాడిన ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..గుంటూరు కారం మూవీ మొదలు పెట్టినప్పటి నుండి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల ముందు ఈ మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అది రూమర్ అని తెలిసి పోయింది. ఆ తరువాత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజహెగ్డే డేట్స్ సర్దుబాటు కాక ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సెకండ్ హీరోయిన్ అయిన శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో త్రివిక్రమ్ మీనాక్షి చౌదరిని డేట్స్ అడిగిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మీనాక్షి మొదటి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. త్రివిక్రమ్  మాట్లాడుతూ, మీనాక్షి ఆల్ రెడీ మొదలుపెట్టేసినట్టు ఉంది 2, 3 సినిమాలు, బిజీ హీరోయిన్ అయిపోతుంది.  తనకు కూడా డేట్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ అన్నాడు. సరదాకి అన్నా, ఇప్పుడు అదే నిజం అయ్యిందని, 2 ఏళ్ల క్రితమే త్రివిక్రమ్ మీనాక్షిని డేట్స్ అడిగాడని నెటిజన్స్ కామెంట్స్  పెడుతున్నారు.

watch video :

Also Read: “అల వైకుంఠపురములో” తో పాటు… “పిల్లల్ని మార్చడం” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన 4 సినిమాలు..!


End of Article

You may also like